YS Viveka case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సంబంధించి సుప్రీం కోర్టు విధించిన విచారణ గడువు ఈరోజుతో ముగియనుండటంతో సీబీఐ శుక్రవారం నాంపల్లి కోర్టులో ఫైనల్ చార్జి షీటు దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులు, అనుమానితులను ఇప్పటికే పలు మార్లు సీబీఐ విచారించింది. విచారణకు వచ్చిన వారందరి స్టీట్ మెంట్లు రికార్డు చేసింది. సీబీఐ ఇంతకు ముందు రెండు చార్జి షీట్లు దాఖలు చేయగా, ఇవేళ మూడో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ ముగియడంతో సీబీఐ అధికారులు నిందితులను కోర్టులో హజరుపర్చారు. అయితే వీరికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించిన సీబీఐ కోర్టు.. కేసు విచారణను జూలై 14వ తేదీకి వాయిదా వేసింది.

మరో పక్క ఇదే కేసుకు సంబంధించి సునీత వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు జూలై 3న విచారించనుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత పిటిషన్ దాఖలు చేగా, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎం సుందరేష్ దర్మాసనం విచారించింది. ఈ కేసును జూలై 3న తదుపరి విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి సీబీఐతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా వైఎస్ వివేకా కేసులో సుప్రీం కోర్టు విచారణకు ముందు ఈ కేసు దర్యాప్తును ముగించినట్లు సీబీఐ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. అయితే.. సుప్రీం కోర్టు విధించిన గడువు మేరకు దర్యాప్తును ముగించామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పేర్లు జూలై 3న సుప్రీం కోర్టు లో జరిగే విచారణలో బయటకు రానున్నాయి.
Breaking: అచ్చుతాపురం సెట్ లో భారీ పేలుడు .. ఒకరు మృతి