NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పవన్ తో బీజేపీ ఆడుకుంటుందా? ఇదే తీరుతో అధికారం సాధ్యమా?

 

మిత్రపక్షాలు అంటే కలిసి ఒకే పడవలో ప్రయాణం చేయాల్సినవి. కష్టమో నష్టమో కలిసి భరించాల్సినవి. రాజకీయ మిత్రపక్షాలుగా మారిన బీజేపీ జనసేన మాత్రం ఒకే పడవలు ప్రయాణం చేస్తాం గాని, ఎవరి తెడ్డు వారిదే, ఎవరి గమనం వారిదే, ఏ వైపు ముందుగా ఒద్దు వస్తే అక్కడ దిగిపోవాలి అన్న వింత స్నేహం చేస్తున్నారు. ఇది రాజకీయంగా ఎంత ప్రయోజనం ఇస్తుంది? లేక రెండు పార్టీలకు ఎంత మేర లాభం చేస్కురుస్తుంది అనేది హైద్రాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాకే తెలుస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికల స్ట్రాటజీ ఫాలో అవుతున్న కాషాయం పార్టీ , జనసేనను ఆంధ్ర ప్రాంత పార్టీగా భావించి తెలంగాణాలో పొత్తు ఉండదని ప్రకటించింది. అంటే ఆంధ్రాలో మాత్రం పవన్ అవసరం బీజేపీకు ఉన్న నేపథ్యంలో అక్కడ ఆయన కావాలని, తెలంగాణాలో అంతంత మాత్రంగా ఉన్న పవన్ పట్టు తమకు అవసరం లేదు అన్నట్లు తేల్చి చెబుతుంది. అంటే స్నేహంలో ఒక ప్రాంతంలో ఒకే తరహాగా పని చేయమని బీజేపీ డైరెక్టుగా పవన్ కు చెబుతున్న మాట.

జనసేనకు తెలంగాణ విభాగం ఉంది

జనసేన రెండు రాష్ట్రాల్లో సైతం ప్రజా పోరాటాలు చేస్తామని చెప్పింది. ఆ మేరకు ఆంధ్రాలోనే కాదు తెలంగాణాలో సైతం కమిటీలు వేసింది. జనసేన తెలంగాణ బాధ్యతలు పవన్కు అత్యంత సన్నిహితుడు శంకర్ గౌడ్ చూస్తున్నారు. గతంలోనే హైద్రాబాద్ నగర కమిటీ వేశారు, నిన్నటికి నిన్న తెలంగాణ విద్యార్థి, యువజన విభాగాలు ఏర్పాటు చేసారు. స్వయానా పవన్ వకీల్ షబ్ సెట్ లో వారికీ నియామక పత్రాలు అందజేశారు. నిజం చెప్పాలంటే ఆంధ్ర కంటే, తెలంగాణ జనసేన విభాగం ప్రజా పోరాటాల్లో ముందు ఉంటుంది. అలాంటిది జనసేన పార్టీ అవసరమే మాకు వద్దు అనే చందాన బీజేపీ వ్యవహరించడం ఎప్పుడు ఇరు పార్టీల నేతల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. జనసేన పార్టీ తెలంగాలో కాస్త వెనుక బడిన హైద్రాబాద్ లాంటి ప్రాంతంలో పవన్ క్రెజ్ ఎక్కువ. యువత ఓట్లు ఎక్కడ ప్రభావితం అయ్యే అవకాశం అధికం. ఎదో రకంగా పవన్ హైద్రాబాద్ ఎన్నికల్లో బీజేపీకు ప్లస్ అవుతాడు తప్ప మైనస్ కాదు. దాదాపు 15 నుంచి 20 డివిజన్ లలో పవన్ తన ప్రభావం చూపగలడు. ఐనా ఇవన్నీ ఆలోచించే బీజేపీ నాయకులు పొత్తు వద్దు అన్నారా? లేక భవిష్యత్తులో బీజేపీ సైతం ఆంధ్ర పార్టీతో జత కట్టింది అని కెసిఆర్ ప్రచారం చేసి లాభం పొందకూడదు అనే తలంపుతో పొత్తు వద్దు అనుకుంటుంది అనేది గాలితాల అనంతరమే తెలియాలి.

ఆంధ్రలో మాత్రం కావాలి

తెలంగాణాలో బలమైన ప్రత్యామ్నాయంగా ఒంటరిగా ఎదగాలని భావిస్తున్న కమలం పార్టీకు ఆంధ్రా మాత్రం జనసేన పక్కన ఉండాలని భావిస్తుంది. పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఆంధ్రాలో కలిసి వస్తేనే తమకు మంచి ప్రయోజనం అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన 6 శాతం ఓట్లు సాధిస్తే బీజేపీ 1 శాతం చేరుకోలేకపోయింది. ఇక కమ్మ, రెడ్డి వర్గాలకు ధీటుగా కాపులకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, జనాభాలో అధికంగా ఉన్న కాపులను దగ్గరకు తీసుకోవడం ద్వారా రాజకీయ పీఠం సాధ్యమని బీజేపీ ఆలోచన. దీనికి పవన్ సహకారం తప్పనిసరి అని, ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్తో కలిసి నడిస్తే మంచి ఫలితాలు వస్తాయనేది బీజేపీ నాయకులూ భావిస్తున్నారు. అంటే బలం ఎక్కువగా ఉన్న చోట పవన్ ను పక్కన పెట్టేందుకు ఆలోచిస్తున్న కాషాయ నాయకులూ, బలం తక్కువగా ఉన్న చోట మాత్రం ఆయనను వాడుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే హైద్రాబాద్ ఎన్నికల్లో బీజేపీ నాయకుల తీరు మీద అసహనంతో ఉన్న పవన్ రెండు రోజుల మంగళగిరి పర్యటనలోను ఎక్కడ బీజేపీ పార్టీ పేరు సైతం ఎత్తలేదు. హైద్రాబాద్ ఎన్నికల మీద క్లారిటీ వచ్చిన బీజేపీ పదం సైతం ఆయన నోటి వెంట రాలేదు. అయితే పిల్లి పిల్లి కొట్టుకుని ఎలుకకు మొత్తం సమర్పిస్తాయా అన్న చందంగా బీజేపీ, జనసేన విడివిడి పోరాటం వాళ్ళ గులాబీ వాసన మరోసారి భాగ్యనగరాన్ని చుట్టేస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju