బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

MP RRR vs TDP: టీడీపీని డీప్ గా కెలుకుతున్న రఘురామ..! బాబు టీమ్ కి కొత్త సమస్యలు..!?

Telugu Desam Party News, YSRCP Live News, Narasapuram MP, YSRCP Rebal MP, Raghuramakrishnamraju MP RRR, MP RRR vs YSRCP, YSRCP vs MP RRR, MP Raghu Rama, Narasapuram MP Resign, Narasapuram MP Live News, Raghu Rama Racchabanda, YS Jagan vs MP RRR, TDP vs MP RRR
Share

MP RRR vs TDP: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీని కెలుకుతున్నారు.. జగన్ ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు.. ఆ పార్టీ నేతలని టార్గెట్ చేస్తున్నారు.. కానీ.. ఆయన టీడీపీని ఎలా కెలుకుతున్నారు..? టీడీపీకి ఎందుకు సమస్యలు సృష్టిస్తున్నారు..? అనేది కాస్త ఆలోచించాల్సిన అంశమే.. ఒక జిల్లా మొత్తం టీడీపీ ఆయన వలన ప్రశాంతత కరవైంది.. చంద్రబాబు కూడా ఈ విషయమై తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం..! రఘురామ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతానని చెప్పిన సంగతి తెలిసిందే. తనపై అనర్హత వేటు వేయించేందుకు వచ్చేనెల 5వ తేదీ వరకూ వైసీపీకి సమయం ఇచ్చారు. ఈ లోపుగా వారు అనర్హత వేటు వేయించకపోతే తానే రాజీనామా చేస్తానని ప్రకటించారు.. అయితే రఘురామ కృష్ణం రాజు ఎప్పుడు రాజీనామా చేయాలి..? ఎప్పుడు ఉప ఎన్నికలకు వెళ్లాలి..? ఏ పార్టీ తరపున పోటీ చేయాలి..? కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఏ విధంగా తీసుకోవాలి..? కేంద్ర ప్రభుత్వ బలగాలను ఏ విధంగా తెప్పించాలి..? కేంద్ర ప్రభుత్వ అధికారిని ఇక్కడ ఎన్నికల అధికారిగా నియమించాలంటే ఏ విధంగా ఫిర్యాదులు చేయాలి..? ఏ విధంగా ముందుకు వెళ్లాలి..? అన్న విషయాలపై పూర్తి క్లారిటీతో ఉన్నారు. ఆయన ఏ పార్టీ తరపున పోటీ చేయనున్నారనే దానిపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అయితే ఇండిపెండెంట్ గానో.., లేదా బీజేపీ తరపున పోటీ చేయనున్నారు. జనసేన, టీడీపీలు మద్దతు ఇవ్వాలి. రఘురామ కృష్ణంరాజు ఏ పార్టీ తరుపున పోటీ చేసినా జనసేన, టీడీపీ అభ్యర్ధులను పోటీకి పెట్టకూడదు. వీళ్లు రఘురామకృష్ణంరాజుకు మద్దతు ఇవ్వాలి. అలా ఇస్తేనే తాను ఖచ్చితంగా గెలుస్తానని రఘురామ కృష్ణంరాజు భావిస్తున్నారు.

MP RRR vs TDP: Disturbing TDP in Depth..
MP RRR vs TDP: Disturbing TDP in Depth..

MP RRR vs TDP: రఘురామా ఒక క్లారిటీ ఇదే..!!

నర్సాపురం పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీకి సుమారు 2 లక్షల ఓట్ బ్యాంక్ ఉంది. టీడీపీకి సుమారు 5 లక్షల వరకు ఓటింగ్ ఉంది. టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే గెలుపునకు మంచి అవకాశాలు ఉంటాయనేది ఒక అంచనా.. రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తే జనసేన నుండి గానీ టీడీపీ నుండి ఎవరైనా అభ్యర్ధి పోటీ చేస్తే ఆయనకు తీవ్రంగా దెబ్బతగులుతుంది. వైసీపీకి వ్యతిరేకంగా రఘురామ కృష్ణంరాజు ఒక్కరే పోటీ చేయాలనేది ఆయన ప్రణాళిక. అలా చేస్తేనే ఆయనకు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనేది అందరికీ ఉన్న క్లారిటీ. ఇది రఘురామ కృష్ణంరాజుకు కూడా ఉన్న క్లారిటీ. అందుకే ఆయన ప్రాధమికంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలి. స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడాలి. అన్ని పార్టీల మద్దతు తీసుకోవాలి. వైసీపీకి వ్యతిరేకంగా తను ఒక్కడే పోరాడాలి. అమరావతి రాజధాని సెంటిమెంట్ వర్క్ అవుట్ చేసుకోవాలి అన్న రీతిలో రఘురామ ముందుకు వెళుతున్నారు.

టీడీపీకి ఎక్కడంటే సమస్య..!?

అయితే టీడీపీ ఇక్కడ క్లారిటీతో ఉందా అనేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరసాపురం పార్లమెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ సిగ్మెంట్ లలో టీడీపీ చాలా బలంగా ఉంది. ఉండి, పాలకొల్లు, తణుకు అసెంబ్లీ సిగ్మెంట్లలో టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉంది. వైసీపీతో పోలిస్తే టీడీపీ చాలా బలంగానే ఉంది. తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం ప్రాంతాల్లోనూ టీడీపీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. సుమారు 40శాతం ఓటు బ్యాంకు టీడీపీకి ఉంది. నియోజకవర్గంలో ఇంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంటే తమ పార్టీ సింబల్ తో ఎవరూ పోటీ లేకపోతే పార్టీ ప్రతిష్ట ఏమి కావాలి..? పార్టీ పరువు ఏమి కావాలి..? అన్న ఒక ఆలోచన, భయం ఉంటుంది. అందుకే పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఒక వేళ రఘురామ కృష్ణంరాజు టీడీపీ తరపున పోటీ చేస్తే కేంద్రం మద్దతు ఇస్తుందా.,? బీజేపీ సపోర్టు చేస్తారో లేదో తెలియదు. రఘురామ టీడీపీ తరపున పోటీ చేస్తే ఆయనకు బీజేపీ మద్దతు ఇస్తే బీజేపీ, టీడీపీ ఒకటే అన్న ప్రచారాన్ని వైసీపీ జనంలోకి సులువుగా తీసుకువెళుతుంది. అలా కాకుండా ఆయన బీజేపీ తరపున పోటీ చేసి జనసేన, టీడీపీ సైలెంట్ గా ఉన్న పెద్ద వివాదం కాదు. సో.. అందుకే టీడీపీ ఎటూ తేల్చుకోలేక కాస్త గందరగోళంలోనే ఉంది.

MP RRR vs TDP: Disturbing TDP in Depth..
MP RRR vs TDP: Disturbing TDP in Depth..

అభ్యర్ధిని నిలపాలా..? వద్దా.. రఘురామ కృష్ణంరాజుకే మద్దతు ఇవ్వాలా..? లేదా సైలెంట్ గా ఉండాలా..? నరసాపురం పార్లమెంట్ ఉప ఎన్నిక వస్తే ఏమి చేయాలి..? అన్న లెక్కల్లో టీడీపీ తర్జనభర్జన పడుతోంది. రకరకాల రివ్యూలు, సమీక్షలు జరుపుతోంది. ఇప్పటికే రఘురామ కృష్ణంరాజు తాను ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నాననీ, ఉప ఎన్నికలకు వెళ్లబోతున్నాననీ చంద్రబాబుకు చెప్పి మద్దతు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన కూడా రఘురామ కృష్ణంరాజుకు మద్దతు ఇచ్చేందుకు డిసైడ్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. చంద్రబాబుతో రఘురామ ప్రాధమిక చర్చలు జరిపిన తరువాతే రాజీనామాకు సిద్దమయ్యారని అంటున్నారు. టీడీపీ నుండి మద్దతు లేకుండా రఘురామ ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేరు. ఇప్పుడు డిసైడ్ కావాల్సింది టీడీపీ. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని టీడీపీ శ్రేణుల్లో దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. రఘురామకు మద్దతు ఇవ్వడమా..? పార్టీ తరుపున అభ్యర్ధి ఉంటారా ..? అనే దానిపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేసి నియోజకవర్గానికి వచ్చిన తరువాత దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..!


Share

Related posts

మూడు రిజర్వాయర్‌ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన

somaraju sharma

కూటమికీ, బిజెపికీ దూరం: నవీన్‌ పట్నాయక్

Siva Prasad

KCR: కేసీఆర్‌కు షాక్ ఇస్తున్న హుజురాబాద్ టీఆర్ఎస్ నేత‌లు

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar