NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

మెగా ఫామిలీ అయితేనే డబ్బులోస్తాయి మరి .. వర్మని ఆపేదెవడు ??

రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పైనపవర్ స్టార్పేరిట ఒక సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే వర్కింగ్ స్టిల్స్ ను బయటపెట్టేసిన వర్మ ఇలా ఎన్నో సినిమాలను ముందు మొదలుపెట్టిన కొన్నిటిని ఆపేశాడు కానీ అతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమాలను మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేసి తీరుతాడు. ‘పవర్ స్టార్సినిమాలో కథానాయకుడు పవన్ కళ్యాణ్ లాగే ఒడ్డూ, పొడవూ, మేనరిజం, బాడీ లాంగ్వేజ్, మెడలో ఎర్ర తువ్వాలు మొత్తం దించేశాడు. అయితే పోర్న్ స్టార్ తో వర్మక్లైమాక్స్అనే సినిమా చేశాడుఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కరోనా పైన కూడా సినిమా తీస్తున్నాడు…. నగ్నం అంటూ హాట్ హీరోయిన్ చేత తెర పైన అందాలు అరబోయించాడు. మరి ఇలా వేరే పంథాలో సాగుతున్న వర్మ ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ పైన పడడం ఏమిటి?

 

Ala Vaikunthapurramuloo Review, US Premiere Live Updates ...

 

ఇక్కడ విశేషం ఏమిటంటే రామ్ గోపాల్ వర్మ కు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ప్రేమ. ఇక మెగా ఫ్యామిలీ అంటేనే చెవి కోకొంటారు. నాలుగు రోజుల గ్యాప్ వస్తే చాలు కళ్యాణ్ ని పట్టుకుని మరికెలుక్కుంటాడు  లేకపోతే అతనికి ఏమీ తోచదు. అయితే గతంలో శ్రీరెడ్డి ని పవన్ కళ్యాణ్ ని పబ్లిక్ లో తిట్టమని ప్రేరేపించింది తనే అని ఒప్పుకున్న వర్మ ను కనీసం మెగా ఫ్యామిలీ కన్నెత్తి కూడా చూడలేదు. అసలు విషయంలో వర్మ ని ఏమి అన్నా లాభం లేదు అన్నట్లే వ్యవహరించారు. మెగా అభిమానులు మరియు అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయినా ఎఫెక్ట్ వర్మ పై కూసింత కూడా పడలేదు. ఇప్పుడు అదే ధైర్యం తో వర్మ సినిమా తీస్తున్నాడా అని అందరికీ సందేహాలు వస్తున్నాయి. కొందరైతే అదే నిజం అనేస్తున్నారు కూడా.

సరే…. సినిమా దర్శకుడికి స్వేచ్ఛ ఉంటుంది. తనకు నచ్చిన కథను తనకు నచ్చినట్లు లీగల్ గా ఎటువంటి ఇష్యూలు రానంతవరకూ తెరకెక్కించుకుంటాడు. మరి డబ్బులు వచ్చేది ఎలా..? ఇదే మెయిన్ పాయింట్. వర్మ ఉన్న పరిస్థితుల్లో అతనిని నమ్మి సినిమాకు డబ్బులు పెట్టే వారు ఎవరు? అదే పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేసే లాగా సినిమా తీస్తే మాత్రం మేము డబ్బులు పెడతామంటూ ఎంతో మంది ముందుకు వస్తారు అన్నది వర్మ లాజిక్. ఇప్పటికే ముందు రెండు సినిమాలను అసలు ఏటిటి ప్లాట్ఫామ్ అనే ఒక మార్గాన్ని కనిపెట్తిన వర్మకు జనాల కథా కమామిషు ఏమిటో అర్థం అయిపోయింది. క్లైమాక్స్, నగ్నం లాంటి రెండు చెత్త సినిమాలు తీసినా కూడా అవి కేవలం మూడు రోజుల్లోనే కోట్ల రూపాయలు లాభాలు తెచ్చి పెట్టాయి.

ఇక మెగా ఫ్యామిలీలోని ప్రస్తుత పాపులర్ హీరో పవన్ కళ్యాణ్ మీద సినిమా తీసుకున్నట్లయితే ప్రొడక్షన్ వ్యాల్యూ సూపర్ వస్తుంది. అతనికి కావాల్సినంత పబ్లిసిటీ మరియు డబ్బు ముడుతుంది. పైగా మెగా ఫ్యామిలీ వారు సౌమ్య పరులు కూడా. ఏదైనా రియాక్ట్ అయితే వారి అభిమానులు రియాక్ట్ అవ్వాలి కానీ వారు మాత్రం తమకు ఏమీ పట్టనట్లు ఉంటారు. వారిలో వారికి అభిప్రాయబేధాలు లేవు కానీ సినిమా వారంటే మాత్రం జాలి, ప్రేమ, దయ, కరుణ అన్నీ వచ్చేస్తాయి.

మరి వారిని అడ్డం పెట్టుకుని, వారిని కించ పరుస్తూ వారి ఇమేజ్ ని డ్యామేజ్ చేసే సినిమాలు తీసేందుకు కావాల్సినంత బడ్జెట్ వస్తుంటే మాత్రం కామ్ గా ఉండడం తప్ప ఎవరు మాత్రం ఏం చేస్తారు..? అలాంటి వారి నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వర్మ లాంటి వారు పవన్ కళ్యాణ్ లాంటి అత్యంత చరిష్మా కలిగిన లీడర్ పైన సినిమాలు తీస్తుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకే పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి తగిన ఆరోపణలు, సాక్ష్యాలు అసలు ఎటువంటి కారణాలు లేక ఇబ్బంది పడతారు కానీ వర్మ మాత్రం తన క్రియేటివిటీతో తనకు నచ్చిన సినిమా తీసేస్తాడు. ఎందుకంటే అవతల ఉన్నది మెగా ఫ్యామిలీ…. తీస్తున్నది పవన్ కళ్యాణ్ మీద. అలా అయితేనే డబ్బులు ఇస్తారు మరియు డబ్బులు వస్తాయి కూడా.

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju