NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP: సీఎం జగన్ కి ఆ “రెడ్డి”ల అల్టిమేటం..!? వారికి అంత సీన్ ఉందా..!?

YSRCP: Reddy Leaders Indirect Warnings to Party!?

YSRCP: ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ తత్వం వేరు.. తీరు వేరు.. పార్టీల క్రమశిక్షణ విషయానికి వస్తే పార్టీలో ఉన్నంత కాలం ఎవరూ పార్టీ లైన్ ఎవ్వరూ దాటలేరు.. జగన్ మాట పార్టీలో అందరికీ శిరోధార్యం. జగన్ మాటని ధిక్కరించే సాహసం ఎవ్వరూ చేయరు. ఆయన మాటని ఎవరూ కాదనరు.. అన్నిటి కంటే ముఖ్యంగా వైసీపీలో పదవులకు ఎటువంటి లాబీయింగులు,సిఫార్సులు పని చేయవు. జగన్ ఒక ప్లానింగ్, ఒక స్ట్రాటెజి, ఒక అవగాహన ప్రకారం పదవులు ఇస్తుంటారు.. అయితే మరో నెల, రెండు నెలల్లో జరగబోయే మంత్రి వర్గ విస్తరణకు మాత్రం పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మర్చి నెలాఖరులోగా కచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరగనుంది అనే వార్తలు వస్తున్నా నేపథ్యంగా అందరి కంటే జగన్ సొంత వర్గీయులు బాగా చురుకయ్యారు. ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగారు. అందరి కంటే కొందరైతే ఏకంగా పరోక్ష హెచ్చరికలకు దిగడమే కొసమెరుపు..!

YSRCP: ఆ నలుగురి స్థానంలో..!

జగన్మోహనరెడ్డి సామాజికవర్గం నుండి ప్రస్తుతం నలుగురు మంత్రులు ఉన్నారు. సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి. ఈ నలుగురు సీఎం జగన్ కు సన్నిహితులే. ఈ నలుగురిలో కూడా ఏ ఒక్కరినో ఉంచి మరొకరిని తొలగించడం కష్టమే. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్యంత సీనియర్.. అండ్ పార్టీలో ఒక అంతర్గత టాస్క్ ప్రకారం పని చేస్తున్నారు. ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంచి సబ్జెక్ట్ ఉంది. మాటకారి. మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. వీళ్లు కాకుండా ఇదే సామాజికవర్గం నుండి చిత్తూరు జిల్లా నుండి తూర్పు గోదావరి వరకూ కూడా చాలా మంది మంత్రిపదవులను ఆశిస్తున్నారు.

YSRCP: Reddy Leaders Indirect Warnings to Party!?
YSRCP: Reddy Leaders Indirect Warnings to Party!?

ఆశిస్తున్న జాబితా పెద్దదే..!

తూర్పు గోదావరి నుండి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణలు ఉండగా ద్వారంపూడి సిన్సియర్ గా, చాలా సీరియస్ గా ట్రై చేస్తున్నారు. ఆయనకు జగన్మోహనరెడ్డితో ఉన్న వ్యక్తిగత పరిచయంతో మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు. మరో వైపు చీర్ల జగ్గిరెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. మిగిలిన ఇద్దరిని పక్కన పెట్టినా ద్వారంపూడి మాత్రం చాలా సీరియస్ గా ప్రయత్నాల్లో ఉన్నారు. గుంటూరు జిల్లాలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఆర్కేల్లో ఖాయమనే వార్తలు ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లాకు వస్తే మంత్రిగా బాలినేని ఉన్నారు. సీనియర్ నాయకుడు, గతంలో మంత్రిగా పని చేసిన మహీదర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయనకు అవకాశం ఉండకపోవచ్చు. ఆయన కూడా ప్రయత్నం చేయడం లేదు. నెల్లూరు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కడప జిల్లాలో జగన్మోహనరెడ్డి మామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి. పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. వీరిలో శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం చీఫ్ విప్ గా ఉన్నారు.., మంత్రి కోసం సీరియస్ ప్రయత్నాల్లో ఉన్నారు.

YSRCP: Reddy Leaders Indirect Warnings to Party!?
YSRCP: Reddy Leaders Indirect Warnings to Party!?

* అనంతపురం జిల్లాలో కేతిరెడ్డి సోదరుల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్లద్దరు లేకపోతే అనంత వెంకట రామిరెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. కర్నూలు జిల్లా నుండి శిల్పా కుటుంబం నుండి ఒకరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాటసానితో పాటు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. వీళ్లంతా కూడా సీనియర్ లు పార్టీలో ఎప్పటి నుండో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుండి ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి. వీరు ముగ్గురు చాలా సీరియస్ గా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా జగన్ సొంత వర్గం నుండే దాదాపుగా 22 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. 22 మందిలో కేవలం నలుగురికి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యపడుతుంది. ఉన్న మంత్రులను తీసివేస్తేనే ఒక పెద్ద తలనొప్పి. ఉన్న మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక టాస్క్ తో పని చేస్తున్నారు. ఆయనను మంత్రి పదవి నుండి తొలగించినా పార్టీలో ఒక కీలకమైన కమిటీ బాధ్యతలను అప్పగించనున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఒక వేళ ఆయనను తొలగించకపోతే ఆయనే సీనియర్ మంత్రిగా ఉంటారు. వీరిలో కొందరు సీనియర్ లు మంత్రి పదవులు దక్కకపోతే పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారని టాక్ నడుస్తోంది. సీఎం జగన్మోహనరెడ్డి వీళ్లను ఎలా దారిలో పెడతారో వేచి చూడాలి. అన్నిటికంటే గమ్మత్తైన అంశం ఏమిటంటే.. వీరిలో కొందరికి తమకు రాకపోయినా పర్వాలేదు.. కూడా రాకపోతే ఒకే అనే అంటారా అహం కూడా ఉంది. అంటే ఒకరికి ఇచ్చి సంతృప్తి పరచాలి.. మరొకరికి ఇవ్వకుండా కూడా సంతృప్తి పరచాల్సిన అవసరం వైసీపీ పెద్దలకు వచ్చింది..!

Related posts

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?