అల్లువారబ్బాయి అర్జున్ అంతా సవ్యంగా సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 19వ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్` చేస్తారు. ఆ వెంటనే సుకుమార్ సినిమా ఉంటుంది. ఏ స్టార్ హీరో అయినా ఒకట్రెండు సినిమాలను లైన్లో పెట్టుకోవడం పరిపాటి. కానీ అల్లు అర్జున్ మరో అడుగు ముందుకేసి వరుసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టుకున్నారు. ఆయన చేయబోతున్నా నాలుగో సినిమాను ఇటీవల `గుణ 369` ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆయన తండ్రి అల్లు అరవింద్ స్పష్టంగా ప్రకటించారు. మా దర్శకుడు బోయపాటితో మా సంస్థలో త్వరలోనే మరో సినిమా అని ప్రకటించారు. బోయపాటి ఈ సారి అల్లు అర్జున్ కోసం ఫ్యాన్స్ ఎంటర్టైన్ అయ్యేలా పూర్తి ఎంటర్టైనింగ్ మాస్ మసాలా స్క్రిప్ట్ తెరకెక్కించారని సమాచారం. ఈ సినిమాలోనే ఉంటే కార్తికేయకు ఓ మంచి రోల్ కూడా ఉండవచ్చని టాక్. `ఆర్.ఎక్స్.100` కార్తికేయ ఆల్రెడీ నాని నటిస్తున్న `గ్యాంగ్‌లీడర్`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సో ఇప్పుడు అల్లు కాంపౌండ్‌లోకి కూడా ఆయనికి అదే స్టేజీ మీద స్వాగతం చెప్పారు అల్లు అరవింద్. దీన్ని బట్టి గీతా ఆర్ట్స్ లో తెరకెక్కే సినిమాలో కార్తికేయకు కూడా ఛాన్సులు ఉండవచ్చని టాక్ నడుస్తోంది.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!