Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలో షూటింగు లలో బిజీగా గడుపుతున్నారు. ఒకేసారి మూడు సినిమాల షూటింగ్లలో పాల్గొంటూ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వీటిలో ఒకటి ఆది పురుష్ దాదాపు షూటింగ్ కంప్లీట్ అయింది. జనవరి నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మిగతా రెండు సలార్, ప్రాజెక్ట్ కె రెండు సినిమాల షూటింగులు చాలా సరవేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
“KGF” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” తీస్తున్నారు. మహానటి ఫిలిం దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్ట్ కె” తెరకెక్కుతోంది. “ప్రాజెక్ట్ కె” లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలక పాత్ర చేస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ సినిమా దాదాపు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మాణ సంస్థలో 50వ సినిమాగా షూటింగ్ జరుపుకుంటున్న “ప్రాజెక్ట్ కె” కోసం హైదరాబాద్ శివార్లలో టెంపుల్ సెట్ వేయడం జరిగిందంట.
ఈ సెట్ లో హీరో.. హీరోయిన్ లపై ప్రత్యేకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో ప్రాజెక్ట్ కె చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. విడుదలైన పోస్టర్ బట్టి చూస్తే ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి స్టోరీ చాలా రహస్యంగా ఉండేటట్లు సినిమా యూనిట్ జాగ్రత్తగా పడుతుంది. అంతేకాదు హాలీవుడ్ టెక్నాలజీ కలిగిన కెమెరాలను ఉపయోగిస్తూ.. “ప్రాజెక్టు కే” షూటింగ్ చేస్తున్నారట. ప్రభాస్ కెరియర్ లోనే ఇది అత్యంత హై బడ్జెట్ సినిమా.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!