స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ప్లాప్ అనే మాట వినని దర్శకుటు రాజమౌళి, కొరటాల శివ. వీళ్ల తరువాత ఆ ప్లేస్‌లో అనిల్ రావిపూడి చేరిపోయాడు. ఫస్ట్ మూవీ పటాస్‌తో సాలీడ్ హిట్ అందుకున్నాడు. ఇక హిట్ కోసం చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్‌ని సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు.
నెక్ట్స్ సినిమాని మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో సుప్రీమ్ తీశాడు.ఈ సినిమాతో మంచి మేసేజ్ ఇస్తునే కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సక్సెస్ కొట్టాడు. ఈ సినిమాతో తేజ్‌కు మార్కెట్ కూడా పెరిగిపోయింది. ఈ సినిమా తరువాత మాస్ రాజా రవితేజతో రాజ ది గ్రేట్ సినిమాని తెరకెక్కించాడు. వరస ప్లాప్‌లతో మతమతమవుతూ, రెండేళ్ళ గ్యాప్ తరువాత సినిమా చేసిన రవితేజకు రాజా ది గ్రేట్ కొత్త ఉత్సహాన్ని ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వరుసగా మూడు సినిమాలు హిట్ కావడంతో దర్శకుడిగా అనిల్ రావిపూడి క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.
రీసెంట్గా సీనియర్ హీరో వెంకటేష్ , మెగా హీరో వరుణ్ తేజ్‌తో కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ హిట్‌గా నిలిచింది. ఇలా వరుస హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ దర్శకుడు కూడా తన సక్సెస్ రేట్‌ని , డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని తన రెమ్యూనరేషన్ భారీగా పెంచాడట. ఇంతకుముందు ఇక సినిమాకు 3కోట్ల తీసుకున్న ఈ దర్శకుడు ఎఫ్ 2 హిట్ కావడంతో 5కోట్లకు పెంచాడని తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!