Actress Pragathi: నటి ప్రగతి అందరికీ సుపరిచితురాలే. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న ప్రగతికి యూత్ లో విపరీతమైన క్రేజ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ లో అనేకమైన పాత్రలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యాంగ్ హీరోలకు మరియు హీరోయిన్ లకు తల్లి పాత్రలలో కనిపిస్తూనే మరోపక్క కుటుంబాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నారు. కెరియర్ పరంగా వరుస అవకాశాలు అందుకుంటూనే సోషల్ మీడియాలో కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోకుండా ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవ్వుతారు. యాభైకి దగ్గరలో వయస్సు దగ్గర పడుతున్న గాని ఫిట్ గా ఉంటారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి నటి ప్రగతి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. తన తండ్రి చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. దీంతో అమ్మతో కలిసి పెరగాల్సి వచ్చింది. ఆ సమయంలో అన్నీ తానే చూసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ రీతిగా పెరగడంతో తనకు తానే బాస్ అనే ఫీలింగ్ వచ్చిందని.. సినిమాలో అవకాశాలు రావడం జరిగింది. అయితే హీరోయిన్ గా చేసే టైంలో రైన్ సాంగ్ లో ట్రాన్స్పరెంట్ చీర కట్టాలి అని అనటంతో సినిమా నచ్చక మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం పెళ్లి చేసుకున్నాను. కొడుకు మరియు కూతురు పుట్టారు. ఆ తర్వాత భర్తతో వచ్చిన విభేదాలు వల్ల తాను విడాకులు తీసుకున్నట్లు ప్రగతి స్పష్టం చేసింది.
పెళ్లి జీవితం చాలా సాఫీగా సాగేందుకు చాలా కష్టపడ్డాను. కాని పరిస్థితులు అనుకూలించకపోవడంతో విడాకులు తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం కొడుకుకి 22 సంవత్సరాలు.. కూతురికి 14 సంవత్సరాల అని తెలిపింది. వాళ్లే తన ప్రపంచం అని… ఎటువంటి నిర్ణయం తీసుకున్న ముగ్గురం కలిసి చర్చించుకుని తీసుకుంటామని పేర్కొంది. పిల్లలు చాలా బాగా అర్థం చేసుకుంటారు అని తెలిపింది. జీవితం మొత్తంలో పెళ్లి అనేది చాలా తొందరపడి తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పెళ్లి ఒకటి మాత్రమే కాదు. జీవితంలో చాలా నిర్ణయాలు కోపంలో తీసుకున్నవి. తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. అని ప్రగతి చెప్పుకొచ్చింది. అంతేకాదు కరోనా సమయంలో ఎదుర్కొన్న ఆర్థికపరమైన ఇబ్బందులు గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!