RRR: “ఆర్ఆర్ఆర్” రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన ప్రతి చోట ఊహించని విధంగా కలెక్షన్ రాబడుతూ.. ఇండియన్ ఫిలిం సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో… ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగుతోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా “ఆర్ఆర్ఆర్” వరుసపెట్టి రికార్డులు క్రియేట్ చేయడం మాత్రమే కాదు కలెక్షన్ లు కళ్లు చెదిరే రీతిలో కలెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 100 కోట్ల మార్కును దాటేయడం.. మాత్రమే కాదు వీకెండ్ తర్వాత నార్మల్ డేస్ లో కూడా… రికార్డు సాయి కలెక్షన్ లు రావడంతో ఇప్పుడు బాలీవుడ్ షేక్ అయిపోతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా బాలీవుడ్ కండలవీరుడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చూడటం జరిగింది. “ఆర్ఆర్ఆర్” చూసిన తర్వాత సల్మాన్ వైరల్ కామెంట్ చేయడం జరిగిందట. సినిమా చాలా బాగుందని “ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ ని మెచ్చుకోవటం జరిగిందట. అంతమాత్రమే కాదు పర్సనల్ గా.. చరణ్ మరియు తారక్ నీ సల్మాన్ ముంబైకి ఆహ్వానించినట్లు సమాచారం. వారిద్దరి పెర్ఫార్మెన్స్.. సల్మాన్ కి బాగా నచ్చినట్లు బాలీవుడ్ మీడియా టాక్. ఇదే సమయంలో “ఆర్ఆర్ఆర్” వంటి సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రావాలని సల్మాన్ ఖాన్ “ఆర్ఆర్ఆర్” చూసిన తర్వాత కామెంట్లు చేసినట్టు టాక్.
“ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ బాగా సపోర్ట్ చేయటం జరిగింది. ఎంతో సినిమా హిట్ అవటంతో సల్మాన్ ఖాన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కంగనారనౌత్.. ఇంకా రణవీర్ సింగ్ లాంటి వారు కూడా “ఆర్ఆర్ఆర్” సినిమా చూసి పాజిటివ్ కామెంట్లు చేయడం జరిగింది. “ఆర్ఆర్ఆర్” బాలీవుడ్ మాత్రమే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ మోస్ట్ మరియు డైరెక్టర్లు కూడా.. జక్కన్న పనితనాన్ని.. చరణ్, ఎన్టీఆర్ నటన పై ప్రశంసల వర్షం కురిపించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!