Unstoppable 2: “అన్ స్టాపబుల్” సెకండ్ సీజన్ ఈనెల 14వ తారీఖు నుండి స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ బావ చంద్రబాబు.. ఇంకా అల్లుడు నారా లోకేష్ తో బామర్ది బాలకృష్ణ.. ప్లాన్ చేయటం జరిగింది. ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ రాజకీయ నేత చంద్రబాబుతో ఈ ఎపిసోడ్ ప్లాన్ చేయటంతో ఎంటర్టైన్మెంట్ పరంగా ఇంకా పొలిటికల్ గా అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా మారింది. హోస్ట్ గా బాలకృష్ణ చంద్రబాబు మరియు లోకేష్ లకి ఎటువంటి ప్రశ్నలు వేస్తారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది.
“అన్ స్టాపబుల్” టాకీ షో మొదటి సీజన్ అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ఓటిటిలో అప్పుడే ఎంట్రీ ఇచ్చిన “ఆహా”కి ఈ షో ఎంతో క్రేజ్ తీసుకొచ్చింది. మొదటి సీజన్ లో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మహేష్ బాబు ఇంకా మోహన్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, నాని పలువురు రావడం జరిగింది. “అన్ స్టాపబుల్” మొదటి సీజన్ కి సంబంధించి అన్ని ఎపిసోడ్ లు ఎంతో అలరించాయి. దీంతో సెకండ్ సీజన్ మొదటి సీజన్ కంటే మరింత గ్రాండ్ గా ప్లాన్ చేయడం జరిగింది.
ఫస్ట్ ఎపిసోడ్ చంద్రబాబు, లోకేష్ లతో చేస్తూ ఉండటంతో దీనికి సంబంధించిన ప్రోమో ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 14వ తారీకు ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇంకా ఈ సెకండ్ సీజన్ లో సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు కూడా రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సెకండ్ సీజన్ చివరి ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ తో ఆహా టీం ప్లాన్ చేసినట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!