Akhil: ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కుటుంబంలో నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన “అఖిల్” ఇప్పటి వరకు సరైన కొట్ట లేకపోయాడు. తండ్రి నాగార్జున అన్నయ్య నాగచైతన్య విజయవంతంగా కెరియర్ కొనసాగిస్తూ దూసుకుపోతుంటే అఖిల్ కి ఇప్పటి వరకు హిట్ పడకపోవడంతో మరోపక్క అక్కినేని అభిమానులు కూడా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలో తండ్రి నాగార్జున అఖిల్ కెరీర్ లో భారీ హిట్ పడాలని స్పెషల్ కేర్ కూడా తీసుకుంటూ .. అప్పట్లో స్టోరీస్ సెలక్షన్ లో కూడా ఇన్వాల్వ్ అయినట్లు వార్తలు రావడం తెలిసిందే.
అదంతా పక్కనపెడితే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో “మోస్ట్ ఎలిజిబుల్” బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ భాస్కర్ కెరియర్ చూస్తే ఎప్పటినుండో సరైన హిట్ లేదు. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే అక్కినేని అభిమానులు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు అనే టాక్ వస్తోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
“ఏజెంట్” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ సినిమా హీరోగా అక్కినేని అఖిల్ ని సురేందర్ రెడ్డి చూపిస్తున్నట్లు స్టిల్స్ బట్టే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ని తాజాగా అఖిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ టాక్. మేటర్ లోకి వెళ్తే డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్ సినిమా కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తాజా వార్త విని సురేందర్ రెడ్డి సినిమా అటో ఇటో అయినా గాని కొరటాలతో మాత్రం కచ్చితంగా అఖిల్ కి హిట్ పడుతుందన్న నమ్మకం తో ఫ్యాన్స్ ఉన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!