NBK 108: తెలుగు చలనచిత్ర రంగంలో దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సినిమా చూసే ప్రేక్షకుడిని సంతృప్తి పరిచేలా కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తూ వరుస పెట్టి సినిమాలు విజయాలు సాధిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా అనిల్ రావిపూడి సినిమాలు ఉంటాయి. కాగా ప్రస్తుతం నటసింహం నందమూరి బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నారు. “NBK 108” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో… మొదటి నుండి యంగ్ హీరోయిన్ శ్రీ లీల పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీ లీల నటిస్తున్నట్లు వార్తలు రావడం జరిగాయి.
అయితే తాజాగా సినిమా యూనిట్… శ్రీ లీల ఈ సినిమాలో నటిస్తున్నట్లు పోస్టర్ తో కూడిన ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవల శ్రీ లీల నటిస్తున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధిస్తున్నాయి. దీంతో బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలో అనిల్ రావిపూడి సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీ లీల కనిపించబోతుందట. తండ్రి కూతురు సెంటిమెంట్ తరహాలో ఈ సినిమా.. యాక్షన్ సెంటిమెంట్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో చిత్రీకరిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
అంతేకాదు ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగులు పలకనున్నారట. దసరాకి ఈ సినిమా రిలీజ్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో 60 ఏళ్ల పాత్రలో బాలకృష్ణ లుక్ ఉండబోతుందట. ఏడాది ప్రారంభంలో “వీరసింహారెడ్డి” సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ బాలకృష్ణ తన ఖాతాలో వేసుకున్నారు. మరి ప్రస్తుతం చేస్తున్న అనిల్ రావిపూడి సినిమాతో ఎటువంటి విజయం సాధిస్తారో చూడాలి.