Sushanth singh Rajputh: 2020లో సరిగ్గా కరోనా ఎంట్రీ ఇచ్చిన సమయంలో దేశంలో లాక్ డౌన్ విధించడం తెలిసిందే. ఆ సమయంలో ఎక్కడికక్కడ అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. పేదవాడు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఆ సమయంలో హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకుని చనిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంతంగా ఎదిగి.. ఒక స్టార్ హీరోగా మారాడు. కెరియర్ పరంగా మంచి టైంలో సుశాంత్ సూసైడ్ చేసుకోవటం అందరికీ అనుమానాన్ని కలిగించింది.

అయితే ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణం బయటపడటంతో నమోదైన కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ అరెస్టు కావటం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్యా అని పోస్ట్ మార్టం నిర్వహించిన హాస్పిటల్స్ సిబ్బంది లో ఒకరు షాకింగ్ కామెంట్ చేశారు. విషయంలోకి వెళ్తే సుశాంత్ మృతదేహానికి కూపర్ హాస్పిటల్ లో రూప కుమార్ అనే వ్యక్తి పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే సుశాంత్ డెడ్ బాడీ చూసినప్పుడు అతని వంటిపై మరియు మెడ పైన గాయాలు ఉండటం జరిగాయట.

ఇదే విషయాన్ని పై అధికారులకు రూప కుమార్ చెప్పాడట. ఈ క్రమంలో పోస్టుమార్టం వీడియో తీయకుండా ఫోటోలు ద్వారా మాత్రమే చేయాలని ఆదేశాలు జారీ చేశారట. ఉదయం కల్లా పోలీసులకు మృతదేహాన్ని అందించాలి అని తెలిపారు. దీంతో సుశాంత్ పోస్టుమార్టం రాత్రి జరిగింది. అతని మృతదేహం చూస్తే దాడి జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది.. అనీ రూప కుమార్ చెప్పుకురావడం జరిగింది. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఎవరు సుశాంత్ నీ చంపారు..? అసలు సుశాంత్ హత్య వెనకాల కోణాలు ఏంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.