స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాలో మెయిన్ హీరోయిన్‌తో పాటు మరో హీరోయిన్ను కీలక పాత్రలో చూపిస్తుంటారు. ఈషారెబ్బా, పార్వతి మెల్టన్, అనుపమ పరమేశ్వరన్ ఇలా చాలా మంది హీరోయిన్స్ ఆయన సినిమాలో సెకండ్ లీడ్‌గా నటించారు. ఇప్పుడు బన్ని సినిమాలో కూడా త్రివిక్రమ్ మరో హీరోయిన్ను తీసుకున్నాడట. వివరాల ప్రకారం నివేదా థామస్‌ను ఓ కీలక పాత్రకు ఎంపిక చేశారట. దీంతో సినిమా వెయిటేజీ మరింత పెరిగింది. ఇప్పటికే టబు, బొమన్ ఇరానీ వంటి తారలు నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , గీతాఆర్ట్స్ కాంబినేషన్లో సినిమా రూపొందుతుంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!