కథ బావుంటే చాలు.. దర్శక నిర్మాతలు దాన్ని నెటివిటీకి అనుగుణంగా ఆయా భాషల్లోరీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాదిన ఘన విజయం సాధించిన చిత్రాలు ఉత్తరాదిలో రీమేక్ అవుతుండగా.. ఉత్తరాదిన సూపర్‌హిట్ అయిన చిత్రాలను దక్షిణాదిలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ క్రమంలో బాలీవుడ్లో గత ఏడాది ఘన విజయం సాధించిన `బదాయి హో` సినిమాను దక్షిణాది భాషల్లోకి రీమేక్ చేయబోతున్నారు. అమిత్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమా దక్షిణాది రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ సొంతం చేసుకుని .. దక్షిణాది భాషల్లో రీమేక్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. బాలీవుడ్లో మినిమం బడ్జెట్‌తో తెరకెక్కి 200 కోట్ల రూపాయల వసూళ్లను ఈ సినిమా సాధించింది. ఆయుష్మాన్ ఖురానా, సాన్యా మల్హోత్రా హీరో హీరోయిన్గా నటించగా.. నీనా గుప్తా, గజ్రాజ్ రావ్ ప్రధాన పాతల్లో నటించారు. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తెలుగు రీమేక్‌లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!