Veera Simha Reddy: సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తారీకు బాలకృష్ణ కొత్త సినిమా “వీరసింహారెడ్డి” విడుదల కానున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మల్లినేనీ దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన కొన్ని సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్భంగా “వీరసింహారెడ్డి” మేకింగ్ వీడియో సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. షూటింగ్ సెట్స్ సాంగ్స్ మేకింగ్ తో పాటు ఫైటింగ్ సన్నివేశాలను చూపించడం జరిగింది.

ఈ మేకింగ్ వీడియోలో బాలయ్య హావ భావాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ తమన్ మ్యూజిక్…శ్రోతలను మరింతగా అల్లరిస్తున్నాయి. చాలా పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ రోల్ లో బాలయ్య కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఒక పరాజయం లేని దర్శకుడిగా గోపీచంద్ మలినేనికి మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో… “వీరసింహారెడ్డి” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య కెరియర్లో అతిపెద్ద ఫ్యాక్షన్ తరహా మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సినిమా సమరసింహారెడ్డి. ఆ సినిమాకి 200 రెట్లు “వీరసింహారెడ్డి” ఉంటుందని గోపీచంద్ మలినేని చెప్పటంతో ఫ్యాన్స్ మంచి జోష్ మీద ఉన్నారు. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

జనవరి ఆరవ తారీకు ఒంగోలులో “వీరసింహారెడ్డి” ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. అదే రోజు సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య డబల్ ఫోజ్ లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజే చిరంజీవి “వాల్తేరు వీరయ్య” విడుదల కానుంది. చాలా సంవత్సరాల తర్వాత సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ సినిమాలు పోటీ పడుతూ ఉండటంతో ఎవరు విజయం సాధిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.