Pushpa: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఊపు ఉపేసింది. బన్నీ పలికిన డైలాగులు వేసిన స్టెప్పులు… ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఇతర దేశాలకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్లు కూడా “పుష్ప” లో బన్నీ యాక్టింగ్ ని ఇమిటేట్ చేయడం జరిగింది.
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. టీమ్ ఇండియాకు చెందిన రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ మరికొంత మంది క్రికెటర్లు.. “పుష్ప” సాంగ్స్ కి స్టెప్స్ వేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే పుష్ప సినిమా హిట్ అవ్వడం పట్ల సీనియర్ నటుడు భానుచందర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప అంత పెద్ద హిట్ అవడానికి ప్రధాన కారణం హీరోయిన్ సమంత అని తెలిపారు. “ఊ అంటావా మవా.. ఊఊ అంటావా” అనే సాంగ్ లో సమంత వేసిన స్టెప్పులు.. సాంగ్ హిట్ అవటం వల్ల సినిమా భారి స్థాయిలో విజయం సాధించిందని భానుచందర్ చెప్పుకొచ్చారు.
ఈ పాట మలయాళం, తమిళంలో కూడా మారుమ్రోగింది అని పేర్కొన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తనకు మంచి స్నేహితుడని.. ఎప్పుడు కనిపించినా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు అని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. డైనమిక్ లీడర్ అని కొనియాడారు. ఇదిలా ఉంటే పుష్ప సెకండ్ పార్ట్ మొదటి పార్ట్ కంటే ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్ నెల నుండి “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయటానికి సుకుమార్ బన్నీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Virata Parvam-Vikram: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల హవా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం థియేటర్స్లో…
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…