సినిమా

Alia Bhatt: అలియా భట్ ని ఆకాశానికెత్తేసిన బిగ్ బి.. ఆ సినిమాలో ఆమె నటన అద్భుతమట!

Share

Alia Bhatt: బాలీవుడ్ టాప్ నటీమణులలో ఆలియాభట్ ఒకరన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనతికాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది అలియా. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వరుస విజయ పరంపరను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆమె తాజాగా గంగూభాయ్ కథియావాడి వంటి సినిమాలో అద్భుతమైన నటనని ప్రదర్శిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈమె నటనకు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులు అయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు.

Big B praises Alia Bhatt
Big B praises Alia Bhatt

Alia Bhatt: ప్రశంసల జల్లులు ఇవే

గంగూభాయ్ పాత్రలో ఆలియా భట్ నటనకు విమర్శల వెల్లువ దక్కుతోంది. ఈ సంవత్సరం ఉత్తమ నటిగా ఆమె అవార్డుకూడా దక్కించుకోబోతోంది అని ఎంతో మంది ఊహాగానాలు చేస్తున్నారు. ఇకపోతే, తన తోటి నటీనటులు కూడా ఆలియాభట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇకపోతే ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ బిగ్ బాస్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ కూడా ఆలియా భట్ నటన పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఒక లెటర్ ద్వారా ఓ సందేశాన్ని కూడా పంపించారు అమితాబచ్చన్. ఆ లెటర్ ని సోషల్ మీడియాలో చూపిస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది ఆలియా భట్.

Big B praises Alia Bhatt
Big B praises Alia Bhatt

అమితాబ్ వ్యాఖ్యలు ఇవే

ఇన్స్టాగ్రామ్ ద్వారా అమితాబ్ బచ్చన్ పంపించిన సదరు లేఖను అలియా తన ఇంస్టాగ్రామ్ వేదికలో షేర్ చేసింది. అమితాబ్ ఆ లెటర్లో “డియర్ అలియా!.. గంగూభాయ్ పాత్రలో చాలా అద్భుతంగా నటించావు.. నీ నటనను ప్రశంసించడానికి నాకు మాటలు రావడం లేదు.. నేను ఈ రాతపూర్వకంగా తెలుపుతున్నాను, నువ్వు సూపర్!” అని రాసుకొచ్చారు. దీంతో బిగ్ బి వంటి బడా స్టార్ హీరోలు తన నటన పై ప్రశంసల వర్షం కురిపించడంతో ఆలియా భట్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ప్రస్తుతం ఆలియాభట్ అమితాబ్ బచ్చన్ తో కలిసి బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.


Share

Related posts

ఎస్పీ బాలసుబ్రమణ్యం – నివాళి : దేశం మొత్తం గుండెకోతలో – ప్రముఖులు ఏమన్నారంటే

sowmya

చిరూ-కొరటాల కాంబినేషన్ పై క్లారిటీ వచ్చేసింది

Siva Prasad

Samantha: ఆ ముగ్గురు ఇష్టమని నిర్మొహమాటంగా మనసులో మాట బయట పెట్టిన సమంత..!!

sekhar