ట్రెండింగ్ హెల్త్

Kobbari Megada: కొబ్బరి మీగడతో క్షణాల్లో మెరిసే చర్మం మీ సొంతం..! 

Share

Kobbari Megada: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచివి.. వేసవి తాపాన్ని తగ్గించడానికే కాదు అందాన్ని పెంపొందించడానికి కూడా కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి.. మరి ముఖ్యంగా కొబ్బరి మీగడ తో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.. మనలో అందరికీ కొబ్బరి పాలు తయారు చేసుకోవడం వచ్చు. కొబ్బరి పాలను అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచితే దాని పైన మీగడ కడుతుంది. దానినే కొబ్బరి మీగడ అని అంటారు.. కొబ్బరి మీగడ తో మచ్చలు లేదు గ్లాసి స్కిన్ ను పొందవచ్చు..!

Skin Lightening Packs of Kobbari Megada:
Skin Lightening Packs of Kobbari Megada:

 

ఒక చెంచా కొబ్బరి పాలు, ఒక చెంచా కొబ్బరి మీగడ , ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మీ ముఖం పై ఉన్న మొటిమలు, వాటి తాలూకు మచ్చలును పోగొట్టి ముఖం కాంతివంతంగా చేస్తుంది.. ఒక చెంచా కొబ్బరి మీగడ, ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం తీసుకొని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోతాయి. వడదెబ్బ నుంచి మిమల్ని రక్షిస్తుంది. మెడ, చేతులు, మోకాలు పై పేరుకున్న నలుపును తొలగించి వేస్తుంది.

Skin Lightening Packs of Kobbari Megada:
Skin Lightening Packs of Kobbari Megada:

 

ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే రెండు చెంచాల కొబ్బరి మీగడ, రెండు చెంచాల కొబ్బరి పాలు, ఒక చెంచా తేనె, ఐదు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. వీటన్నింటినీ కలిపి ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండుసార్లు చేస్తుంటే మచ్చలను తొలగించడం తోపాటు గ్లాస్సీ స్కిన్ మీ సొంతం.


Share

Related posts

Alzheimer’s: ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించక పొతే  పూర్తిగా  జ్ఞాపక శక్తి పోవడం ఖాయం!!

Kumar

Chia Seeds: మెరుగైన ఆరోగ్యం కోసం మేలైన విత్తనాలు..!!

bharani jella

బిగ్ బాస్ 4: అన్ని సీజన్ల కంటెస్టెంట్ ల కంటే అతనే హైలెట్ అంటున్న జనాలు ..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar