సినిమా

Mahesh Babu: కృష్ణ బర్త్ డే నాడు మహేష్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైస్..??

Share

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ ప్రతి సంవత్సరం తన తండ్రి  కృష్ణ బర్తడే నాడు అనగా మే 31 వ తారీకు తన సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ఉంటాడు అన్న సంగతి తెలిసిందే. చేయబోయే సినిమా టైటిల్ లేదా ట్రైలర్ గాని.. గ్లింప్స్… రిలీజ్ చేస్తూ ఉంటాడు. గత ఏడాది సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో పరిస్థితి దారుణంగా ఉండటంతో కరోనా కారణంగా చాలా మంది మరణిస్తూ ఉండటంతో ఎటువంటి అప్డేట్ రాలేదు. కానీ అంతకుముందు సంవత్సరం త్రివిక్రమ్ సినిమా ప్రకటనతో పాటు “సర్కారు వారి పాట” కి సంబంధించి చిన్నపాటి ట్రైలర్ రిలీజ్ చేశారు. Big surprise for Mahesh fans on Krishna's birthday

ఇదిలా ఉంటే ఈ ఏడాది త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటించి ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైస్ మహేష్ ఇవ్వనున్నట్లు సమాచారం. “అ” అనే అక్షరంతో మహేష్ సినిమా టైటిల్ ఉండనున్నట్లు ఇండస్ట్రీ టాక్. మేటర్ లోకి వెళితే గత కొంత కాలం నుండి త్రివిక్రమ్ తన సినిమాలకు “అ” అక్షరంతోనే టైటిల్ పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ మహేష్ సినిమాకు కూడా కంటిన్యూ చేయనున్నట్లు సమాచారం. ఇక రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి ప్రకటన వచ్చే అవకాశం లేదని ఎందుకంటే.. ఇప్పటికి కూడా స్క్రిప్ట్ కన్ఫామ్ కాలేదనీ చర్చల దశలోనే ఉన్నట్లు టాక్. Big surprise for Mahesh fans on Krishna's birthday

సో ఈ ఏడాది కృష్ణ పుట్టినరోజు నాడు మే 31 వ తారీకు త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటన ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు, ఖలేజా రెండు డిఫరెంట్ సినిమాలు రావడంతో… ఈ సినిమాపై ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

Rajamouli : రాజమౌళి అడిగితే ప్రభాస్ – అనుష్క కాదంటారా..?

GRK

నా స‌ల‌హాను చిరు పాటించ‌లేదు: అమితాబ్‌

Siva Prasad

పాయింట్ బ్లాంక్ లో కొరటాల-విజయ్ దేవరకొండ సినిమా ..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar