దేవి నాగవల్లి.. అనుకోని రీతిలో బిగ్ బాస్ 4 ఏలిమినేట్ అయ్యి అందరికి షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ 4 మూడోవ వారంలో మెహబూబ్ ఎలిమినేట్ అవుతాడని అంచనా వేసిన ఎంతోమంది బిగ్ బాస్ విశ్లేషకుల అంచనాలను తారుమారు చేసింది దేవి నాగవల్లి. నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన దేవిని చూసి సోషల్ మీడియాలో ప్రజలు షాక్ అవుతున్నారు.
ఆమెను ఎందుకు ఎలిమినేట్ చేశారు? ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ప్రశ్నిస్తే ఎలిమినేట్ చేస్తారా అంటూ ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. అయితే అందరూ ప్రశ్నిస్తున్న సరే ఆమె మాత్రం ఎటువంటి కామెంట్ చెయ్యట్లేదు. కేవలం రాహుల్ సిప్లిగంజ్ కు మాత్రమే దేవి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో కూడా చాలా వరకు పాజిటివ్ గానే చెప్పింది.
అయితే ఆమె బయటకు వచ్చిన 24 గంటల్లోనే ఆమె ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యింది. అంతేకాదు బిగ్ బాస్ ఆమెకు సీక్రెట్ రూమ్ లో ఉండే అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె ఒప్పుకోలేదట. ఎలిమినేట్ అయ్యాక మళ్లీ బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా వచ్చేది కానీ సీక్రెట్ టాస్క్ కానీ వచ్చేది లేదు అని స్ట్రాంగ్ గా చెప్పేసిందట దేవి నాగవల్లి.
ఇక బయట మీడియా వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ ఇవ్వాలని అడిగినప్పటికి ఆమె అందుకు ఒప్పుకోలేదట. ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పేసిందట. ఇక ఇది మాత్రమే కాదు ఆమె ఆలోచన విధానంలో, మనిషిని అంచనా వేయడంలో, నడవడికతో, నిజాయితిలో ఎక్కడ ఏ విషయంలో తీసిపోని దేవి నాగవల్లి ఎలిమినేట్ అవ్వడం అందరికి షాక్ కి గురి చేసింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!