నాగ బాబు ఫుల్ సపోర్ట్ ఆ ‘కంటెస్టెంట్’కేనట.. దాని వెనుక అసలు కారణం ఏంటంటే?

ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ 4 దాదాపు చివరి దశకు వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఈ షోలో ఎవరికి వారు నిరూపించుకుంటూ ప్రేక్షకులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ సీజన్ లో ఎవరూ ఊహించని ట్విస్టులు, టాస్కులతో దాదాపు పదకొండు వారాలు పూర్తి చేసుకొని 12 వ కొనసాగుతోంది.

అయితే కేవలం 25 రోజుల్లో ముగియనున్న ఈ రియాలిటీ షో లో విజేతలు ఎవరనే దానిపై ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు ఎలాగైనా టైటిల్ గేలవాలన్న కసితో హౌస్ లోని కంటెస్టెంట్ లు ఎవరికి వారిని నిరూపించుకుంటున్నారు. అయితే ప్రేక్షకులు మాత్రం తమకు ఇష్టమైన కంటెస్టెంట్ లకు ఓట్లు వేసి వాటిని రక్షించుకునే పనిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే మెగాబ్రదర్ నాగబాబు కూడా ఈ రియాల్టీ షోపై విజేత ఎవరు అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ రియాల్టీ షో పై స్పందిస్తూ నాగబాబు తన ఫుల్ సపోర్ట్ ఆ కంటస్టెంట్స్ కేనని తెలియజేశారు. అయితే నాగబాబు జబర్దస్త్ కమెడియన్ అవినాష్, అభిజిత్ కు సపోర్ట్ చేయాలని వీడియో రూపంలో ప్రేక్షకులకు తెలియజేశారు.

ఈ రియాల్టీ షోలో పాల్గొన్న అవినాష్ వ్యక్తిగతంగా ఎంతో మంచి కుర్రాడని, అతను ఓ మంచి హీరోగా సక్సెస్ అయి ఉంటే ఎంతో బాగుండేది అని నాగబాబు తెలిపారు బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్ , అవినాష్ ప్రవర్తన తనకు ఎంతో నచ్చిందని తెలియజేస్తూ, వారికి ఓట్లు వేసి వారిని సపోర్ట్ చేస్తూ ఫైనల్ వరకు తీసుకురావాలని తన అభిమానులను కోరారు. అయితే వీరిద్దరిలో ఎవరు విజేతగా నిలిచిన తనకు ఆనందమే నని,తన సపోర్ట్ మాత్రం ఇద్దరికీ ఉంటుందని నాగబాబు ఈ సందర్భంగా తెలియజేశారు.