Shanmukh jaswanth- Deepthi Sunaina : బిగ్ బాస్ హౌస్ లో నడిచే ప్రేమ ప్రయాణాలు కేవలం షో వరకు మాత్రమే పరిమితమవుతాయని ఇదివరకు బిగ్ బాస్ హౌస్ లో ప్రేమలోపడి బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇందులో భాగంగానే సీజన్ 2 కంటెస్టెంట్ అయినా దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఈ అమ్మడు తనీష్ తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనిష్, సునయన ఎవరి దారి వారు చూసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు యూట్యూబ్ స్టార్ గా ఉన్న దీప్తి సునయన బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న తర్వాత ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందు దీప్తి సునయన మరొక యూట్యూబ్ స్టార్ట్ అయిన షణ్ముఖ జస్వంత్ తో ప్రేమలో ఉన్నారు. షణ్ముఖ జస్వంత్ యూట్యూబ్ స్టార్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన చేసే వీడియోలకు ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు, అందరి ముందు ఎంత ఓపెన్ గా చెప్పేశాడు షణ్ముఖ. అయితే కొద్ది రోజుల్లో వీరి ప్రయాణం సుఖంగానే సాగినప్పటికీ, వీరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో కొన్ని రోజుల పాటు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇదే విషయం గురించి షణ్ముఖను ఎంతోమంది అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండా దాటవేసే వాడు.
ఆ షో ద్వారా ఒకటైన దీప్తి, షణ్ముఖ:
గతంలో దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న షణ్ముఖ ఆమె కోసం పచ్చ బొట్టు కూడా వేయించుకున్నాడు. అయితే చాలా రోజుల పాటు దూరంగా ఉన్న ఈ జంట ప్రస్తుతం మళ్ళీ కలిసి ఒకే కార్యక్రమంపై కనిపించడంతో తిరిగి వీరిద్దరు కలుసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ జోడి స్టార్ మాలో ప్రసారం కాబోతున్న 100% లవ్ ప్రోగ్రాంలోకి వచ్చారు. ఈ ప్రోగ్రాంకి రావడమే కాకుండా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి అందరి ముందు ఒప్పుకున్నారు. తామిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నామని ఈ షో ద్వారా తెలియజేశారు. యాంకర్ రవి, విష్ణుప్రియ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో దీప్తి సునయన, షణ్ముఖ జశ్వంత్ జంట కూడా అందరినీ ఆకట్టుకున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!