బిగ్ బాస్ 4 : మోనాల్ అతనికి ఇచ్చిన కౌగిలికి అల్లాడిపోయాడు…! అఖిల్, అభిజిత్ కాదండోయ్…. ఇతను కొత్తోడు

ఈ సీజన్లో వారం వారం బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు మామూలుగా ఉండడంలేదు. కంటెస్టెంట్ ల మధ్య వైరం పెరిగేలా…. ఆటలో పదును తేలేలా.. ఇగో తలెత్తేలా చేస్తున్నాడు. ఇక ఈ వారం ఇచ్చిన టాస్క్ మరింత భయంకరంగా ఉంది. మంచి మనుషులు రాక్షసులు అని రెండు గ్రూపులుగా విడగొట్టి అందులో మంచి మనుషులకు రాక్షసులు చుక్కలు చూపించారని తెలుస్తోంది.

 

ఎవరు ఎవరిని ఎక్కువగా విసిగించారు అన్నది అసలు కాన్సెప్ట్. ఇక ఊహించనివిధంగా ఇంటిలో రాక్షసులు చేసిన రచ్చ మాములుగా లేదు. ఈ టాస్క్ లో బిగ్ బాస్ చెప్పినట్లు మంచి మనుషులుగా కొందరు, రాక్షసులుగా మరికొందరు భయంకరంగా చేశారు.

అవినాష్ రావణుడి గెటప్ వేస్తూ ఒక అద్భుతమైన డైలాగ్ వదిలాడు. రాక్షస రాజ్యానికి నేను మొలకలు తెప్పిస్తాను అంటూ ప్రతి ఒక్కరికి చుక్కలు చూపించేశాడు. నోయల్, అమ్మ రాజశేఖర్, దివి, మోనాల్ వంటి వారు మంచి మనుషులుగా ఉండగా…. రాక్షసులు వీరిని శారీరకంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా వారి బట్టలు పడేసి బెడ్స్ పాడుచేశారు.

ఇక అవినాష్ హింస విపరీతంగా ఉండగా…. మోనాల్ అతనికి ఒక రొమాంటిక్ హగ్ ఇచ్చింది. వేడిగా ఉన్న అవినాష్ ని కౌగలించుకుని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ దెబ్బకు తట్టుకోలేక అవినాష్…. అరియానా కాపాడు అంటూ గోల గోల చేశాడు. అయినప్పటికీ మోనాల్ అతనిని విడిచి పెట్టలేదు.