మెగా హీరోలలో తన ట్రాక్ సపరేట్ అన్న రీతిలో ఐకాన్ స్టార్ బన్నీ దూసుకుపోతున్నా డు. కెరియర్ పరంగా “అలా వైకుంఠపురంలో” సినిమాకి ముందు కొంత గ్యాప్ తీసుకున్నా గానీ… ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా అట్టర్ ఫ్లాప్ తర్వాత దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే అల్లు అర్జున్ ఏటువంటి సినిమా చేయలేదు. కథలు వింటూనే ఉన్నారు.
ఆ టైంలో తన కెరీర్లు రెండు మర్చిపోలేని హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలో “అలా వైకుంటపురంలో” చేసి బ్లాక్ బస్టర్ విజయం సాధించడం జరిగింది. ఆ వెంటనే సుకుమార్ దర్శకత్వంలో ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో పుష్ప చేశాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా బన్నీ పేరు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమొగింది. “పుష్ప” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సినిమాలో బన్నీ మేనరిజం.. వేసిన స్టెప్పులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సౌత్ ఇండియా టాప్ ప్లేస్ లో ఐకాన్ స్టార్ బన్నీ తర్వాత కాజల్..!!
ముఖ్యంగా పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే సినిమా విడుదలయ్యి టీవీలో వచ్చేసిన గాని తాజాగా.. ఇండియాలో ఏ హీరో సాధించని రీతిలో అల్లు అర్జున్ పుష్పతో మరో రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే “పుష్ప” మూవీ ఆల్బమ్ ఏకంగా ఐదు బిలియన్ వ్యూస్ సాధించడం జరిగింది. ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో బన్నీ. అక్షరాల 500 కోట్ల వ్యూస్ “పుష్ప” ఆల్బమ్ రాబట్టడం జరిగింది. పుష్పలో ఐటెం సాంగ్ ఊఉ అంటావా , శ్రీవల్లి సాంగ్స్ దాక్కో దాక్కో మేక సాంగ్స్ ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకోవడం జరిగాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!