నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో “ఘోస్ట్” అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. నాగార్జున కెరియర్ లో ఇది 99 వ సినిమా. “ది గోస్ట్” తర్వాత చేయబోయేది 100వ సినిమా. దీంతో నాగార్జున 100వ సినిమా ఏ దర్శకుడు చేస్తారు అనే దాని విషయంలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. చాలామంది దర్శకుల పేర్లు ఇటీవల వినపడ్డాయి. కే రాఘవేంద్రరావు తో పాటు మరి కొంత మంది స్టార్ దర్శకుల పేర్లు బయటికి వచ్చాయి.
అయితే తాజాగా మాత్రం నాగ్ తన వందవ సినిమా బాధ్యతను డైరెక్టర్ మోహన్ రాజా చేతిలో పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం మోహన్ రాజ చిరంజీవి హీరోగా “గాడ్ ఫాదర్” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విజయదశమినాడు విడుదల కానుంది. ఈ క్రమంలో నాగార్జున వందవ సినిమా కి సంబంధించి దర్శకుడు విషయంలో మోహన్ రాజని సీన్లోకి చిరంజీవి తీసుకువచ్చినట్లు టాక్. అంత మాత్రమే కాదు ఆల్రెడీ నాగార్జునకి… మోహన్ రాజా స్టోరీ కూడా వినిపించినట్లు .. నాగ్ కూడా కొద్దిగా మార్పులు చేర్పులు సూచించి ఓకే చెప్పినట్లు సమాచారం.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగార్జున నటించిన “ది గోస్ట్” త్వరలో విడుదల కానుంది. అనంతరం మోహన్ రాజా కథ అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే నెలలోనే ప్రకటన చేయడం జరుగుతుంది అని అంటున్నారు. లేకపోతే మరో డైరెక్టర్ తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నాగార్జునకు పోటీ వస్తున్న కన్నడ స్టార్ హీరో?
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!