Puri Jagannadh: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అని అందరికీ తెలుసు. చాలా సందర్భాలలో పూరి దర్శకత్వంలో వచ్చిన సినిమాల విజయోత్సవాలలో.. ఆర్జివి పాల్గొనడం జరిగింది. ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ భారీ బ్లాక్ బస్టర్ సినిమా స్టోరీ లైన్ ఆర్జీవి మైండ్ లో నుండి వచ్చిందట. తాజాగా ఈ వార్త ఇటీవల సోషల్ మీడియాలో బయటపడింది. మేటర్ లోకి వెళితే సూపర్ స్టార్ మహేష్ బాబు తో పూరి జగన్నాథ్ చేసిన “బిజినెస్ మాన్” స్క్రిప్ట్ లైన్.. మొట్టమొదటిసారి చెప్పింది రామ్ గోపాల్ వర్మ అంట.
అప్పట్లో రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ముంబైలోనే ఉండేవారు అన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో బిజినెస్ మాన్ ఐడియా పూరికి ఆర్జివి ఇవ్వ డం జరిగిందట. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ ఇటీవల చెప్పుకొచ్చారు. ఒకసారి రామ్ గోపాల్ వర్మ నాకు ఫోన్ చేసి…ముంబైలో దావూద్ ఇబ్రహీం లాంటి మాఫియా డాన్ ఎవరూ లేరు.
Read More: Mahesh Babu: బ్లాక్ బస్టర్ కోసం మహేష్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్??
ఎవడన్న వచ్చి డాన్ అవ్వాలంటే అవ్వచ్చు. దీనిమీద స్క్రిప్టు రాస్తావా..? అని ఆర్జివి గారు అడిగారు అదే “బిజినెస్ మాన్” సినిమాని తాజా విషయాన్ని ఇటీవల పూరి జగన్నాథ్ బయటపెట్టారు. ఈ సినిమాని పూరి జగన్నాథ్ కేవలం మూడు నెలల్లోనే తీసి బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు క్రియేట్ చేసారు. పోకిరి తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ సినిమా అంచనాలకు మించి సూపర్ డూపర్ హిట్ అయింది. మహేష్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ రీతిలో డైలాగులు ఉండటంతోపాటు .. హై వోల్టేజ్ యాక్షన్, పోరాట సన్నివేశాలు ఆడియన్స్ ని అంగీకరించటంతో సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!