RRR: మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా.. రెండు తెలుగు రాష్ట్రాలలో మెగా అభిమానులు భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. పైగా “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూ చరణ్ బర్త్ డే వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 25 వ తారీఖున పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయ్యి.. సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో సైతం విడుదల అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రికార్డు స్థాయి కలెక్షన్ల తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే పుట్టినరోజు సందర్భంగా చరణ్.. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్పందించారు. ముఖ్యంగా సినిమాని ఆదరించటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. చరణ్ పెట్టిన పోస్ట్…” డైరెక్టర్ రాజమౌళి గారి “ఆర్ఆర్ఆర్” సినిమా పట్ల మీరు చూపించిన ప్రేమ మరియు ఆదరణకు అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంత ఉత్సాహంగా ఈ సినిమా చూసిన అందరికీ ప్రత్యేకమైన నా కృతజ్ఞతలు.. అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదే సమయంలో జన్మదినం సందర్భంగా ఈ అపూర్వమైన పుట్టినరోజునీ… బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నానని చరణ్ తెలియజేశారు. ఇదిలా ఉంటే “ఆర్ఆర్ఆర్” ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 223 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాహుబలి రికార్డులు తిరగరాయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే.. మరో కొత్త లెక్కలు రాజమౌళి సెట్ చేయడం గ్యారెంటీ.. బాహుబలి 2 రికార్డులు బద్దలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని విశ్లేషకులు అంటున్నారు. పైగా వీకెండ్ కావడంతో.. దేశంలోనే కాదు విదేశాల్లో సైతం… టికెట్లు దొరకని పరిస్థితి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!