Akhil:అఖిల్ అక్కినేని పరిచయం అక్కర్లేదు. నాగార్జున రెండో వారసుడైన అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’తోనే తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఎప్పటినుండో అక్కినేని వారికి డాన్సులు విషయంలో కాస్త నిరాశ ఉండేది. మిగతా వాళ్ళలాగా వీరు డాన్సులు చేయలేరు అనే అపవాదు ఉండేది. అయితే దాన్ని అఖిల్ పూర్తిగా చెరిపివేసాడు. అవును.. అఖిల్ డాన్సులు విషయంలో ప్రత్యేకంగా కనిపించాడు. మంచి బాడీ లాంగ్వేజ్ తో ఈజ్ గా డాన్సులు వేస్తాడు అఖిల్. అయితే సినిమాల సక్సెస్ విషయంలో మాత్రం కాస్త వెనకబడ్డాడు. ఇకపోతే అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఏజెంట్ సినిమా కహానీ:
భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఏజెంట్ రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన లుక్స్ మంచి టాక్ తెచ్చుకున్నాయి. అఖిల్ డిఫరెంట్ ప్రెష్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. హీరోని లుక్ పరంగా చాలా గ్రౌండ్ వర్క్ చేసి రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా మంచు కొండ ప్రాంతాన్ని లొకేషన్ గా ఎంచుకున్నారు. మనాలీ మంచు పర్వాతాల్లో కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక షూట్ లో భాగంగా అఖిల్ కి చిన్నపాటి గాయాలు కూడా తగిలినట్టు సమాచారం. యాక్షన్ సన్నివేశంలో ఏజెంట్ చాలా రిస్క్ చేసినట్టే కనిపిస్తుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ సినిమా కాపీ అని అంటున్నారు?
తాజాగా ఈ సినిమాకి సంబంధించి అఖిల్ కొత్త ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో హీరో డబుల్ జాకెట్ ధరించి మంచు కొడల్లో వున్నాడు. గిరజాల కలిగి, పోనీ టెయిల్ తో అఖిల్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లోని జోన్ స్నోని గుర్తు చేసేలా వున్నాడు అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ని హీరో కూడా ఇలాంటి లుక్ లోనే మంచు పర్వతాల్లో కనిపిస్తాడు. దీంతో ‘ఏజెంట్’ జోన్ స్నోని కాపీ కొడుతున్నాడా? అన్న సందేహం ఇపుడు తెరపైకి వస్తుంది. నెట్టింట ఈ 2 ఫోటోలు జతచేసి “సేమ్ టూ సేమ్” అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు కొందరు ఔత్సాహికులు. లొకేషన్ పరంగా కూడా ఒకే విధంగా ఉండటమే ఇంతగా హైలైట్ అవుతుందని కొందరి వాదన.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!