NewsOrbit
సినిమా

F3: `ఎఫ్ 3` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌.. వ‌చ్చిందెంత‌..? రావాల్సిందెంత‌..?

F3: స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లో స‌త్తా చాటుతున్న అనిల్ రావిపూడి.. `ఎఫ్ 3` వంటి మ‌రో వినోదాత్మ‌క చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఇందులో విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించ‌గా.. వారి స‌ర‌స‌న త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేశారు. రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఈ ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. `ఎఫ్ 2`కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం మే 27న విడుద‌లై.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఎట్రాక్ట్ చేస్తున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతోంది.

తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.35 కోట్లు, రెండో రోజు రూ. 7.5 కోట్ల షేర్‌ను కొల్ల‌గొట్టిన ఈ చిత్రం.. మూడో రోజు సండే కావ‌డంతో మ‌రింత పుంజుకుని రూ. 8.85 కోట్ల షేర్‌ను వ‌సూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా `ఎఫ్ 3` ఫ‌స్ట్ వీకెండ్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 12.20 కోట్లు
సీడెడ్: 3.59 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 3.36 కోట్లు
తూర్పు: 1.88 కోట్లు
పశ్చిమ: 1.54 కోట్లు
గుంటూరు: 2.06 కోట్లు
కృష్ణ: 1.77 కోట్లు
నెల్లూరు: 1.15 కోట్లు
———————
ఏపీ+తెలంగాణ‌= రూ. 27.55 కోట్లు(రూ. 44.40 కోట్లు~ గ్రాస్)
———————

క‌ర్ణాట‌క‌+రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.80 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 5.20 కోట్లు
———————
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్‌= రూ.34.55కోట్లు(58.05 కోట్లు~ గ్రాస్)
———————

కాగా, రూ. 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే ఫ‌స్ట్ వీకెండ్‌ వ‌చ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 29.95 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సి ఉంది. మ‌రి ఆ టార్గెట్‌ను ఈ చిత్రం అందుకుంటుందో..లేదో..చూడాలి.

 

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N