Devatha Serial: దేవుడమ్మ సత్య ను తీసుకుని చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తారు. ఏంటి ప్రాబ్లం అని డాక్టర్ అడిగితే.. మా సత్య కి పెళ్లి అయ్యి పది ఏళ్ళు అయినా పిల్లలు పుట్టలేదు అని చెప్తుంది. అదే అదేంటి టెస్టులు చేయించుకో లేదా అని అడుగుతుంది. చేయించాము డాక్టర్ అనగానే.. సరే ఆ రిపోర్ట్ ఇవ్వమని అడుగుతుంది. ఈ రిపోర్ట్స్ లో చాలా క్లియర్ గా ఉంది. కదా మీకు ఇంతకుముందు డాక్టర్స్ ఏం చెప్పలేదా అని అంటుంది. రిపోర్ట్స్ లో ఉన్న దాని ప్రకారం ఈ అమ్మాయి గర్భసంచిలో ప్రాబ్లం ఉంది.ఈమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెబుతుంది..
సత్య నిజం తెలుసుకున్న తరువాత ఇంటికి వచ్చాక వెక్కి వెక్కి ఏడుస్తుంది.. నింద తన మీద వేసుకుని ఆదిత్య బాధనంతా భరించాడు.. ఇన్నాళ్లు మీరంతా ఆదిత్య లో లోపం ఉందని అనుకుంటున్నారు అది అబద్ధం. కానీ ఆదిత్యలో కాదు నాలో ఉంది లోపం.. ఇది నిజం అని సత్య అసలు విషయం సత్య కుండ బద్దలు కొడుతుంది. రూమ్ లోకి వెళ్లి సత్య కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అంతలో ఆదిత్య వస్తాడు. ఆదిత్యని చూసేసరికి ఏడుస్తూ దండం పెడుతుంది.
వదిన నేను నీ దగ్గర ఒక నిజం దాచి పెట్టి తప్పు చేశాను అని సూరి అంటాడు. ఈరోజు వరకు మీకు తెలియని నిజం ఒకటి ఉంది రుక్మిణి ఇల్లు వదిలి వెళ్లేసరికి తను గర్భవతి.. ఏంటి సూరి నువ్వు చెప్పేది అని అంటుంది దేవుడమ్మ షాక్ అవుతూ.. మిగతా ముచ్చట్లు తరువాయి భాగంలో తెలుసుకుందాం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!