ట్రెండింగ్ సినిమా

Devatha Serial: రేటింగ్ లో తగ్గని దేవతా సీరియల్..! మాధవ్ నిజస్వరూపం రాధకి తెలుస్తుందా..!?

Share

Devatha Serial: అనుబంధాలకు నిలయం దేవత సీరియల్.. నేటితరం వీక్షకులకు ఆప్యాయతలు, అనుబంధాలు తెలిసేలా చేస్తుంది.. తాజాగా విడుదలైన టిఆర్పి రేటింగ్స్ లో దేవత సీరియల్ మూడవ స్థానంలో ఉంది.. గత నాలుగు వారాలుగా చూసుకుంటే దేవత సీరియల్ మూడవ స్థానంలో నిలుస్తూ కార్తీకదీపం, ఇంటి గృహలక్ష్మికి గట్టి పోటీ ఇస్తుంది..! ఇప్పటికే 534 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్.. అనూహ్యమైన మలుపులతో ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది..!

Devatha Serial: Rating And 535 Episode Highlights
Devatha Serial: Rating And 535 Episode Highlights

Devatha Serial: 535వ ఎపిసోడ్ హైలెట్స్..

దేవి వాళ్ళ అమ్మ రాధ తనకు దూరమైతే తన బాధ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు రాధా ఆదిత్యకు అర్థమయ్యేటట్లు చెబుతుంది. దేవి మాటలకు ఆదిత్య చలించిపోయి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటాడు.. ఈ మధ్యకాలంలో పరిచయమైన దేవి నాకు దూరం అవుతుంటేనే నాకు చాలా బాధగా ఉంది. అలాంటివి 11 సంవత్సరాల నుంచి తనను పెంచిన నువ్వు తనకు దూరం అవుతుంటే తనకు ఎంత బాధ ఉంటుందో నాకు అర్థమైంది. నేను దేవిని దత్తత తీసుకొని చెబుతాడు ఆదిత్య. దేవి ఆఫీసర్ సార్ తో ఎప్పటికి మీ ఫ్రెండ్స్ గా ఉండమని చెబుతుంది. ఇక రాదా ఆర్ నిర్ణయాన్ని రామ్మూర్తి జానకమ్మ లకు చెబుతుంది దాంతో దేవి ఇంట్లోనే తమతోపాటు శాశ్వతంగా ఉంటుంది అని తెలిసి వారు ఊపిరి పీల్చుకుంటారు.

Devatha Serial: Rating And 535 Episode Highlights
Devatha Serial: Rating And 535 Episode Highlights

రామ్మూర్తి, జానకమ్మ ఇద్దరూ రాధ గతాన్ని ఏంటి అని నిలదీస్తారు. దేవిని దత్తత ఇవ్వడానికి తన గతానికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతారు. రాధా నిజం చెబితే మొత్తానికే మోసం వస్తుందని తెలుసుకున్న మాధవ్.. ఈ మాటలు విన్న మాధవ్ రాధా నిజం చెప్పకుండా.. ఆఫీసర్ సార్ తన భర్త అని చెప్పకుండా అడ్డుపడతాడు. మాధవ్ రాధతో ఈరోజు ఆదిత్య దేవిని కావాలి అని అన్నాడు.. రేపటి రోజున నిన్ను కూడా రమ్మని అడుగుతాడు. తన భార్యగా నీ మీద హక్కు ఉంది అని అంటాడు.. రాధ ఆఫీసర్ సార్ ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. ఆయనకు కావాల్సింది బిడ్డా నేను కాదు అని గట్టిగా సమాధానం చెబుతుంది..


Share

Related posts

Vijay Master : మరికొన్ని గంటల్లో మాస్టర్ మూవీ రిలీజ్ కానీ ఈలోపే ఇండస్ట్రీ హిట్ డిసైడ్ చేశేశారు ..!

GRK

Radhe Shyam: వ‌ర‌ల్ట్ వైడ్ `రాధేశ్యామ్` ఫస్ట్ డే క‌లెక్ష‌న్‌.. ఇంకా ఎంత రావాలంటే?

kavya N

నందమూరి ఎన్టీఆర్ పై అభిమానులు కామెంట్లు.. నెట్టింట వైరల్!

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar