NewsOrbit
Entertainment News సినిమా

అరుదైన గౌరవం దక్కించుకున్న డైరెక్టర్ శంకర్..!!

Share

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. అంతకుముందు మల్టీస్టారర్ సినిమాల హవా నడిచింది. ఇప్పుడు మల్టీ స్టార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. చాలా వరకు దర్శకులు పాన్ ఇండియా సినిమాలు చేయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అయితే అందరికంటే ముందే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ తరహా సినిమాలు చేసిన డైరెక్టర్ శంకర్. దక్షిణాది సినిమా రంగంలో తిరుగులేని దర్శకుడిగా పేరు ఉన్న శంకర్.. తన సినిమాలలో విజువల్ ఎఫెక్ట్స్ 90 లలోనే అద్భుతంగా చూపించే వారు. శంకర్ చేసిన చాలా సినిమాలు తమిళంలో మాత్రమే కాదు దక్షిణాదిలో ఇంకా హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి.

Director Shankar who got a rare honor..!!

ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో ఇంకా కమలహాసన్ తో సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో శంకర్ కి అరుదైన గౌరవం దక్కింది. మేటర్ లోకి వెళ్తే తాజాగా డాక్టరేట్ అందుకున్నారు. తమిళనాడులోని వేల్స్‌ ఇంజినీరింగ్, రీసెర్చ్‌ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసింది. శంకర్ సినిమా రంగంలోకి వచ్చే 29 సంవత్సరాలు అయింది. త‌న మొద‌టి సినిమా అర్జున్ హీరోగా ‘జెంటిల్‌మెన్‌’ను తెర‌కెక్కించారు. ఆ త‌రువాత‌ ‘ఒకే ఒక్కడు’, ‘జీన్స్’, ‘బాయ్స్’, ‘శివాజీ’, ‘భారతీయుడు’, ‘రోబో’, ‘ఐ’ వంటి సినిమాల‌తో చ‌రిత్ర సృష్టించారు.

Director Shankar who got a rare honor..!!

శంకర్ చాలావరకు సందేశాత్మకమైన సినిమాలు చేస్తూ ఉంటారు. సమాజాన్ని ప్రభావితం చేసే తరహాలో శంకర్ సినిమాలు ఉంటాయి. కమలహాసన్ తో ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్ “ఇండియన్ 2” చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి 80 శాతం షూటింగ్ కంప్లీట్ కావడం జరిగింది. ఇక రామ్ చరణ్ తో భారీ బడ్జెట్ పాన్ ఇండియా నేపథ్యం కలిగిన సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం మీ రెండు సినిమాల షూటింగ్ లతో శంకర్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు డాక్టర్ ఎటు రావడంతో శంకర్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.


Share

Related posts

స్టార్ సింగర్ ని పెళ్లి చేసుకోనున్న ప్రభాస్ హీరోయిన్!

Teja

షాకింగ్: గంగవ్వను ప్లాన్ ప్రకారం పంపించారట..! ఇక ‘బిగ్ బాస్’ని నమ్మేదెలా?

Teja

ఎంజీ రామచంద్రన్‌గా అరవింద స్వామి

Siva Prasad