టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సీనియర్ రచయిత గా పరుచూరి బ్రదర్స్ కి మంచి క్రేజ్ ఉంది. 90 లలో వచ్చిన చాలా సినిమాలకు పరుచూరి బ్రదర్స్ చైతన్య సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే వారు. సినిమా చూసి సరైన జడ్జిమెంట్ ఇవ్వడంలో కూడా పరుచూరి బ్రదర్స్ స్పెషలిస్ట్ లు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన సినిమాలను చూసి పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ గా “RRR” చూసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “RRR”లో భీమ్ పాత్ర కంటే రామ్ పాత్ర నిడివి కాస్త ఎక్కువగా ఉంది అని తెలిపారు.
అయినా గాని దర్శకుడు రాజమౌళి ఆ రెండు పాత్రలను రెండు కళ్ళలా చూశారనిపించింది..అని స్పష్టం చేశారు. పాత్రనిడివి ఎంత ఉందన్నది ముఖ్యం కాదని.., ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపించింది అనేది ముఖ్యమని పరిచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. పెద్దరాయుడు సినిమాలో రజనీకాంత్ రోల్ అతి తక్కువ సమయమే ఉన్నప్పటికీ.. ఎప్పటికీ ఆ రజిని చేసిన పాపారాయుడు రోల్ గుర్తుకొస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో పరుచూరి గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
“RRR” సినిమా విడుదలైన టైంలో ఎన్టీఆర్ పాత్రనిడివి చాలు తక్కువగా ఉందని తారక అభిమానులు రాజమౌళి పై సీరియస్ కావడం జరిగింది. సినిమాలో రామ్ చరణ్ నీ హైలెట్ చేసినట్లు అప్పట్లో టాక్ వచ్చింది. కానీ తారక్ ఎటువంటి విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. అందరూ కలిసికట్టుగానే పనిచేస్తే విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు. “RRR” థియేటర్ లో మాత్రమే కాదు ఓటీటీ లలో కూడా అనేక రికార్డులు సృష్టించింది. ఓటీటీ లలో “RRR” చూసి హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు చాలామంది దర్శకులు టెక్నీషియన్లు దర్శకుడు రాజమౌళి పై ఇంకా ఇద్దరు హీరోలపై రకరకాల కామెంట్లు చేస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే వచ్చే ఆదివారం ఆగస్టు 14 వ తారీకు ఈ సినిమా “స్టార్ మా” లో ప్రసారం కానుంది.