RRR: ప్రపంచ సినిమా రంగంలో “RRR” పేరు మారుమ్రోగుతుంది. నిన్న ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “RRR” ఆస్కార్ గెలవడంతో భారతీయ సినిమా ప్రేమికులు ఫుల్ సంతోషంగా ఉన్నారు. ప్రధాని మోడీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యమంత్రులు ఇంకా వ్యాపారవేత్తలు సినీ ప్రముఖులు “RRR” సినిమా యూనిట్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. “RRR” భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని మరింత పెంచిందని కొనియాడుతున్నారు. అయితే ఈ సినిమా ముందుగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఛాంబర్ సెలెక్ట్ చేయలేదు. గుజరాతి సినిమాని ఆస్కార్ కి నామినేట్ చేయడం జరిగింది.
ఇటువంటి పరిస్థితులలో “RRR” ఆస్కార్ నామినేషన్ కి సెలెక్ట్ అయ్యా రీతిలో తెరవ వెనక నుండి కథ నడిపించిన వ్యక్తి రాజమౌళి కొడుకు కార్తికేయ. ఆస్కార్ అకాడమీ సభ్యులకు స్పెషల్ షోస్ వేయించి. “RRR”.. ఆస్కార్ కి నామినేట్ అయ్యేలా దగ్గరుండి బాధ్యత తీసుకోవడం జరిగింది. “RRR” ఆస్కార్ నామినేషన్ కి సెలెక్ట్ అయ్యాక ప్రమోషన్ కార్యక్రమాలలో సైతం కార్తికేయ ఫుల్ బిజీగా ఉండి… అవార్డు రావడంలో కీలక పాత్ర పోషించారు. అందువల్లే ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ప్రత్యేకంగా కార్తికేయ పేరు ప్రస్తావించి.. అభినందించడం జరిగిందట. ఆస్కార్ రావడం లో మాత్రమే కాదు “RRR” సినిమా రిలీజ్ అవ్వకు ముందు కూడా కార్తికేయ ప్రమోషన్ కార్యక్రమాలను చాలా అద్భుతంగా ప్లాన్ చేయడం జరిగింది.
పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావటంతో వరుస పెట్టి ఇంటర్వ్యూలు ప్లాన్ చేసి మరోపక్క ప్రీ రిలీజ్ వేడుకలు కూడా సక్సెస్ అయ్యేలా కార్తికేయ ప్రముఖ పాత్ర పోషించారు. రాజమౌళి సినిమా థియేటర్ ఒక ఎత్తు అయితే… జనాల్లోకి ఆ సినిమా బలంగా రీచ్ అయ్యేలా కొడుకు కార్తికేయ ప్రమోషన్ కార్యక్రమాలలో కీలకంగా రాణించడం జరిగింది. ఆ రీతిగానే ఆస్కార్ రావటంలో కూడా… ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది.