Prabhas: దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మొట్టమొదటి సినిమా చత్రపతి. సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ప్రభాస్ క్రేజీ మాస్ లో ఒక రేంజ్ లో పెరిగిపోయింది. అయితే ఆ తర్వాత ఆ స్థాయిలో హిట్ కొట్టడానికి ప్రభాస్.. అనేక రీతులుగా కష్టపడ్డాడు. కానీ ఆ స్థాయిలో తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో.. మిర్చి సినిమాతో ఆడియన్స్ ని మెప్పించాడు.
ప్రభాస్ ని.. హైట్ కి తగ్గ చూపించటంలో..స్టోరీ కాన్సెప్ట్ పాతదైనా గాని ప్రభాస్ మేనరిజం అద్భుతరీతిలో ఆవిష్కరించడంలో కొరటాల శివ సక్సెస్ అయ్యి సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర అందరికీ గుర్తుండిపోయేలా చేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ మొట్టమొదటిసారిగా ఫిలింనగర్ లో రిజిస్టర్ చేసింది దుర్గా ఆర్ట్స్ బ్యానర్ అట. మహేష్ బాబు కోసం దుర్గా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాని రిజిస్టర్ చేయించటం జరిగినది అనే సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఫిలిం వర్గాలలో బయటపడింది.
కానీ “మిర్చి” సినిమా యూనిట్ దుర్గా ఆర్ట్స్ ని సంప్రదించి.. టైటిల్ ఇవ్వాలని కోరగా వెంటనే వాళ్ళు ఇవ్వటం జరిగిందట. మొత్తం మీద చూస్తే మహేష్ బాబు “మిర్చి” టైటిల్ ప్రభాస్ కి అదిరిపోయే హిట్ అందుకున్నాడని తాజా వార్త పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదే టైటిల్ పై మహేష్ బాబు సినిమా చేసి హిట్ అందుకుంటే అది కూడా ఒక రకంగా ఉంటుంది అని కూడా అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!