F3: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఎఫ్ 3`. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ`ఎఫ్ 2`కు ఇది సీక్వెల్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేశారు. సునీల్, సోనాల్ చౌహాన్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలను పోషించారు.
ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మే 27న గ్రాండ్‌గా విడుదలైంది. భారీ కథ ఏమీ లేకపోయినా.. కావాల్సినంత వినోదం ఉండటంతో ఈ మూవీ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సమ్మర్ సోగాళ్లు బాక్సాఫీస్ వద్ద నయా కలెక్షన్స్‌ను రాబడుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.35 కోట్లు, రెండో రోజు రూ. 7.5 కోట్లు, మూడో రోజు రూ. 8.85 కోట్ల షేర్‌ను రాబట్టిన ఈ చిత్రం.. నాల్గొవ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ రూ.4.68 కోట్ల రేంజ్లో షేర్‌ను వసూల్ చేసి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. ఇక ఏరియాల వారీగా `ఎఫ్ 3` నాలుగు రోజుల టోటల్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 14.24 కోట్లు
సీడెడ్: 4.27 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.04 కోట్లు
తూర్పు: 2.22 కోట్లు
పశ్చిమ: 1.73 కోట్లు
గుంటూరు: 2.34 కోట్లు
కృష్ణ: 2.05 కోట్లు
నెల్లూరు: 1.33 కోట్లు
———————
ఏపీ+తెలంగాణ= రూ. 32.23 కోట్లు(రూ. 51.65 కోట్లు~ గ్రాస్)
———————
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా: 2.02 కోట్లు
ఓవర్సీస్: 5.70 కోట్లు
———————
వరల్డ్ వైడ్ కలెక్షన్= రూ.39.95కోట్లు(66.70 కోట్లు~ గ్రాస్)
———————
కాగా, రూ. 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. క్లీన్ హిట్‌గా నిలవాలంటే మొదటి నాలుగు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 24.55 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!