సినిమా

Mahesh Babu: మ‌హేష్ అంత హ్యాండ్సమ్‌గా క‌నిపించ‌డానికి అస‌లు కార‌ణం అదేన‌ట‌!

Share

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు అందం గురించి ఎంత వ‌ర్ణించినా త‌క్కువే అవుతుంది. నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ ఇర‌వై ఏళ్ల కుర్రాడిగా క‌నిపించ‌డం టాలీవుడ్‌లో హీరోల్లో మ‌హేష్ బాబుకు మాత్ర‌మే సొంతం. మహేష్ అందం ఎవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్ అని అంటారు అభిమానులు. అయితే మ‌హేష్ హాలీవుడ్ హీరో మాదిరి సూప‌ర్ హ్యాండ్స్‌మ్‌గా క‌నిపించ‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ లు బ‌య‌ట పెట్టారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

మ‌హేష్ బాబు తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. గీతా గోవిందం సినిమాతో మంచి గుర్తింపు ద‌క్కించుకున్న ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సముద్రఖని విల‌న్‌గా చేశారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు.

భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ ఫైట్ మాస్ట‌ర్స్‌గా వ‌ర్క్ చేసిన రామ్‌-ల‌క్ష‌ణ్‌లు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకున్న రామ్‌-ల‌క్ష‌ణ్‌లు.. మ‌హేష్ గ్లామ‌ర్ సీక్రెట్ ను కూడా బ‌య‌ట పెట్టారు. వారు మాట్లాడుతూ.. `మహేశ్ బాబుతో ఇంతకుముందు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా చేశాము. ఈ మూవీ షెడ్యూల్ లో భాగంగా మేము ఓసారి కశ్మీర్ వెళ్లాము.

అక్కడ విపరీతమైన చలి ఉంటుంది. ఈ చలిలో కూడా పొద్దున్నే లేచి మహేష్ గారు వ్యాయామాలు చేశారు. షూగింగ్ పూర్తి చేసుకుని మ‌ళ్లీ సాయంత్రం వ్యాయామాలు చేసేవారు. అలాగే ప్ర‌తి రోజూ ఆయ‌న మూన్ ధ్యానం చేస్తారు. హెల్త్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అందుకే ఇప్పటికీ ఆయన అంత గ్లామర్ గా .. హ్యాండ్సమ్ గా క‌నిపిస్తారు` అంటూ చెప్పుకొచ్చారు.


Share

Related posts

Balakrishna: బాలయ్యని ఇప్పటివరకు ఎవరూ చూపించని రీతిలో చూపిస్తా అంటున్న డైరెక్టర్. !!

sekhar

Shruti Haasan: ఎన్ని కోట్లైనా ఇస్తాము చిరంజీవి పక్కన యాక్ట్ చేయమన్నారు..ఆమె సమాధానమిదే..!

GRK

మా` సభ్యులను ప్రోత్సహించండి

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar