Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” మే 12వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ బొమ్మ తెర మీద కనిపించనున్న క్రమంలో… అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పాటలు మరియు ట్రైలర్ రిలీజ్ అయి మంచి పాజిటివ్ వాతావరణం సినిమాపై క్రియేట్ చేయడం తో.. కచ్చితంగా “సర్కారు వారి పాట” మహేష్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇంకా రిలీజ్ కి వారం రోజులు మాత్రమే ఉండటంతో… ప్రస్తుతం సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తూన్నారు. నేను లో భాగంగా డైరెక్టర్ పరుశురాం హీరోయిన్ కీర్తి సురేష్ ఇంటర్వ్యూ ఇవ్వగా తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ “సర్కారు వారి పాట” సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు.
మహేష్ బాబు వరుస పెట్టి నాలుగు సినిమాలకు అవకాశం ఇచ్చారు అని రామ్-లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక “సర్కారు వారి పాట” లో మహేష్ ఎప్పటిలాగానే అదరగొట్టేశారు అని.. తెలియజేశారు. ముఖ్యంగా సినిమాలో సెకండాఫ్ చేజింగ్.. యాక్షన్ సీన్ చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బయటకు వచ్చాక ఆ ఫైట్ గురించి మాట్లాడుకుంటారు. అంతమాత్రమే కాదు మా 20 ఏళ్ల కెరీర్ మొత్తానికి.. ఈ చేజింగ్.. యాక్షన్… ఫైట్ సీన్ హైలెట్ అనే రామ్ లక్ష్మణ్ తెలియజేశారు. ఈ వ్యాఖ్యలతో మహేష్ ఫ్యాన్స్ సినిమా పై మరింత అంచనాలు పెట్టుకున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!