Genelia: ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన జెనీలియా.. తమిళం, హింది, కన్నడ భాషల్లో కూడా నటించింది. అయితే కెరీర్ పిక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌ను 2012లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. మళ్లీ ఇనేళ్లకు సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
త్వరలోనే టాలీవుడ్లోకి కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ప్రస్తుతం ఒక సినిమా రూపొందుతోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీలా హీరోయిన్గా నటిస్తుండగా.. కీలక పాత్రలో జెనీలియా కనిపించబోతోంది.
ఇటీవలె ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు జెనీలియా అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు హీరోయిన్గా దూసుకుపోతున్న సమయంలో ఒక్కో సినిమాకు రూ. 70 లక్షలు అందుకున్న జెనీలియా.. ఇప్పుడు రీ ఎంట్రీ మూవీకి ఏకంగా రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందట.
సినిమాకు పాత్ర కీలకం కావడం, అందుకు ఆమె బాగా సెట్ కావడంతో నిర్మాత కూడా వెనుకంజ వేయకుండా జెనీలియా అడిగింత ఇస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!