Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం `గని`. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ కలిసి ఈ మూవీని నిర్మించారు.
ఇందులో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నదియా కీలక పాత్రల్లో మెరిసారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 8న విడుదలైన ఈ మూవీ.. తొలి రోజే నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. రొటీన్ కథ, ప్రాధాన్యత లేని పాత్రలు, ట్విస్ట్ లు ఏమీ లేకపోవడం, నెమ్మదిగా సాగే కథనం థియేటర్స్‌లో ప్రేక్షకుడిగా తీవ్రంగా విసుగు తెప్పించాయి.
టాక్ అంతంత మాత్రంగా ఉండటంతో.. ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా యావరేజ్‌గానే ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్స్‌లో ఫ్లాప్ అయినా ఓటీటీ వేధికగా హిట్ అవుతున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన చిత్రాలను రెండు, మూడు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలై పరాజయం పాలైన ‘రాధేశ్యామ్’ రెండు వారాల్లోనే డిజిటల్లో సందడి చేసింది.
ఈ నేపథ్యంలోనే గని సినిమాను సైతం ఓటీటీలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గని స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29 నుండి స్ట్రీమింగ్ చేయాలని డేట్ లాక్ చేశారట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే ఆహా టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!