న్యూస్ సినిమా

Pooja Hegde – Dil Raju: పూజా హెగ్డేను కామెంట్స్ చేసి నెటిజన్స్‌కు బుక్కైన దిల్ రాజు..!

Share

Pooja Hegde – Dil Raju: తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, నెటిజన్స్ దిల్ రాజును ఇప్పుడు ఆడేసుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘బీస్ట్’. ఈ చిత్రం ఏప్రిల్ 13న పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కాగా, ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించారు. కాగా, తెలుగులో బీస్ట్ మూవీని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రత్యేకంగా ప్రమోషన్స్ నిర్వహించారు.

pooja-hegde-is commented by dil-raju
pooja-hegde-is commented by dil-raju

ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్, హీరోయిన్ పూజా హెగ్డే సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన దిల్ రాజు హీరోయిన్ పూజా హెగ్డే మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందు..ఓ దర్శకుడు స్క్రిప్ట్ ని రెడీ చేసుకుని అందిరిని మెప్పించడం ఎంతో కష్టమని అన్నారు. ఈ విషయంలో చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మీద ప్రశంసలు కురిపించారు. ఇంతవరకు బాగానే ఉంది.

Pooja Hegde – Dil Raju: విపరీతంగా దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఇదే వేదికపై పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ.. ‘పూజా మన కాజా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె ఏ ప్రాజెక్ట్ లో లెగ్గుపెడితే అది సూపర్ హిట్ అన్నారు. ఈ విషయంలో ‘బీస్ట్’ ఆల్ రెడీ సూపర్ హిట్ అయిపోయిందని..చెప్పుకొచ్చాడు. ఇక దిల్ రాజు నాకూ ఓ సూపర్ హిట్ కావాలని.. తన డేట్స్ ఇస్తే సినిమా చేసుకుంటానని మోసేశాడు. అంతేకాదు, పూజా హెగ్డే తెలుగు, తమిళ, హిందీ, భాషల్లో ఎదుగుతున్నారని చెప్పుకొచ్చారు. పూజా.. కాజా అంటూ దిల్ రాజు అన్న మాటలు ఇప్పడు హాట్ టాపిక్ కావడం అసలు దిల్ రాజు ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేక కొందరు నెటిజన్స్ దిల్ రాజుపై కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, విపరీతంగానూ దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు.


Share

Related posts

Intinti Gruhalakshmi: తులసి హెల్త్ విషయంలో మిరాకిల్స్.. నందుకి క్లాస్ పీకిన లాస్య..! ప్రేమ్ కి అవమానం..!

bharani jella

పిల్లలు మంచి నిద్రను పొందాలంటే మీరు ఇలా చేయవలిసిందే!!

Kumar

ఐక్య రాజ్య సమితిని వణికిస్తున్న కరోనా..!!

Special Bureau