Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హిట్ కొట్టి దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తుంది. బాహుబలి వంటి హిస్టారికల్ హిట్ తర్వాత.. ప్రభాస్ చేసిన సినిమాలు మొత్తం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇటువంటి పరిస్థితులలో మంచి హిట్ పడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆది పురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే… మారుతి సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం “సలార్” సినిమా షూటింగ్ నన్ను బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా తెరకెక్కిస్తూ ఉండటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ క్రమంలో “సలార్” సినిమా టీజర్ కు సంబంధించి సరికొత్త అప్ డేట్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే జూన్ 16వ తారీకు ప్రభాస్ “ఆది పురుష్” మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే.. జూన్ చివరి వారంలో “సలార్” సినిమా విడుదల చేయనున్నారట. ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమాగా “సలార్” నిర్మితమవుతుంది. ప్రభాస్ అభిమానులను మెప్పించేలా యాక్షన్ సన్నివేశాలు.. ఉండే విధంగా… చాలా పవర్ ఫుల్ రోల్ లో హీరోయిజం క్యారెక్టర్ ఉంటుందని సమాచారం.
విడుదలకు దాదాపు రెండు నెలలు ముందుగానే..”సలార్” ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉందట. Kgf వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ మరియు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రశాంత్ నీల్ కి మంచి గుర్తింపురావడంతో బాహుబలితో ప్రభాస్ ఊహించని క్రేజ్ ఉండటంతో… సలార్ ప్రమోషన్స్ ఊహించని వీధిలో నిర్మాతలు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేశాను సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి జూన్ నెల చివరిలో రిలీజ్ కాబోయే సలార్ టీజర్ లో క్లారిటీ రానున్నట్లు టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!