Gopichand: గోపీచంద్ కొత్త సినిమా “పక్కా కమర్షియల్”. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా పక్కా కమర్షియల్ కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో గోపీచంద్ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి అనేక విషయాలను తెలియజేస్తూ తన మొదటి సినిమా “జయం”లో చేసిన విలన్ పాత్ర కి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తాజా ఇంటర్వ్యూలో గోపీచంద్ తెలియజేశారు.
గోపీచంద్ మాట్లాడుతూ అందరూ ఆచరించటం వల్ల మరియు అభిమానించటం వల్లే ఇండస్ట్రీలో ఈరోజు ఈ స్థాయిలోకి రావడం జరిగింది అని చెప్పుకొచ్చారు. “జయం” మూవీలో విలన్ పాత్ర చేసినందుకు అందుకున్న పారితోషకం 11,000 అని స్పష్టం చేశారు. 11 అనేది డైరెక్టర్ తేజ లక్కీ నెంబర్.. అంట.. దీంతో నాకు పదకొండు వేలు రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఇక కెరియర్ మొత్తానికి అత్యధికంగా అందుకున్న రెమ్యూనరేషన్ సినిమా “పక్కా కమర్షియల్” అని స్పష్టం చేశారు. ఈ సినిమాలో యాక్షన్ తోపాటు ఎమోషన్ అన్ని.. ఉంటాయి అని పేర్కొన్నారు.
గ్యారెంటీగా “పక్కా కమర్షియల్” విజయం సాధిస్తుందని గోపీచంద్ ధీమా వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో విలన్ పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన గోపీచంద్.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే. దీంతో “పక్కా కమర్షియల్” సినిమాలో “నీ కంటే ముందుగానే విలనిజం చేసిన వాడిని.. చూసిన వాడిని” అంటూ గోపీచంద్ డైలాగ్ చెప్పటం హైలెట్ గా మారింది. జులై 1వ తారీఖు ఈ సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతి దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్టైనర్ గా “పక్కా కమర్షియల్” తెరకెక్కడం జరిగింది.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…