Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు. తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్ లో జ్వాల నిరూపమ్ కు లవ్ ప్రొపోజ్ చేయడానికి వస్తుంది. సడెన్ గా ఫోన్ రావడంతో అక్కడ నుండి. చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందామా..నిరుపమ్‌కు జ్వాలను దగ్గర చేసేందుకు హిమ ప్రయత్నిస్తోంది. నిరుపమ్‌నే చేరేందుకు ఏడడుగుల దూరంలో జ్వాల ఉంటుంది. ఎంతో ఆనందంగా ఏడో అడుగు వేసే సమయానికి జ్వాలకు ఫోన్ వస్తుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఏడు అడుగు వేయకుండానే వెళ్ళిపోయిన జ్వాల :
మరో వైపు నిరుపమ్ కూడా తనకు హిమ అంటే ఇష్టం… తననే పెళ్లి చేసుకుంటాను అనే విషయాన్ని ఎలాగయినా జ్వాలకు చెప్పేయాలి అని అనుకుంటాడు.నువ్ నన్ను ప్రేమించడం తప్పు. జ్వాల అసలు అలా ఎందుకు అనుకున్నావో, ఊహించుకున్నావో తెలీదు గానీ.. అది చాలా తప్పు అని మనసులో అనుకుంటాడు.ఇక ఏడో అడుగు జ్వాల వేసేలోపు శోభ ఫోన్ చేసి నేను హిమను అని చెప్పడంతో ఒక్కసారిగా జ్వాల షాక్ అయిపోతుంది. నేను.. హిమను.. నీ ప్రియమైన శత్రువుని.. నా గురించి నీ చేతి మీద రాసుకున్నావ్.. నీ ఆటో మీద కూడా రాసుకున్నావ్ కదా?రా మరి నన్ను కలుసుకోవా? పట్టుకోవా? నువ్వు ఇప్పుడు కనుక రాకపోతే నాకు కోపం వస్తుంది. మళ్ళీ నేను మనసు మార్చుకుంటాను.అని శోభ అనడంతో జ్వాల అక్కడ నుండి వెళ్లిపోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
హిమ అంటే ఇష్టం అని జ్వాలకు చెప్పేస్తా అంటున్న నిరూపమ్:
జ్వాల అలా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంతో హిమ, నిరూపమ్ ఇద్దరు అలానే చూస్తుండి పోతారు.ఇక నిరూపమ్ మాత్రం జ్వాల ఏడో అడుగు వేసిన వెంటనే.. నేను నిన్ను ప్రేమించడం లేదు నా మనసులో హిమే ఉంది అని చెబుదామని అనుకున్నాను. కానీ వెళ్లిపోయింది అని నిరుపమ్ అంటాడు. బావ నీకు ముందే చెప్పాను కదా? అని హిమ అంటే.. నువ్ వందసార్లు చెప్పినా వెయ్యి సార్లు చెప్పినా నువ్వే నా లోకమని, నువ్వే నా భార్యవని అంటాడు నిరుపమ్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సౌర్య, హిమల రిలేషన్ గురించి నిజం తెలుసుకున్న శోభ:
ఇక ఆర్టిస్ట్ గీత వేసిన బొమ్మలను శోభ చూసి ఆశ్చర్యపోతోంది. హిమే జ్వాల అని తెలుసుకుంటుంది.ఇక మీతో ఆడుకుంటాను చుడండి అని తెగ సంబరపడిపోతుంది. కుటుంబం మొత్తం భలే దొరికారు కదా మీకు చుక్కలు చూపిస్తా అని నవ్వుకుంటుంది.ఏంటండి సౌందర్య గారు.. మీరు ఎక్కువ చేశారు కదా?.. అంతకు మించి ఎక్కువ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను.నేను ఆడే ఆటకు మీరు అల్లాడి. పోతారు అంటూ అచ్చం మోనిత లాగానే కుట్ర చేస్తుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నా శత్రువు హిమ ఫోన్ చేసిందని చెప్పిన జ్వాల:
సీన్ కట్ చేస్తే హిమ జ్వాల దగ్గరకు సీరియస్ గా వచ్చి ఏమనుకుంటున్నావ్ అలా చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం ఏంటి అని కోపంతో అరుస్తుంది. కానీ జ్వాల మాత్రం ఏమి మాట్లాడదు. ప్రతీ సారి నేను సైలెంట్‌గా ఉంటే నువ్ వాగేదానివి.. ఇప్పుడు నేను వాగుతుంటే.. నువ్ మాట్లాడటం లేదేంటి.. అక్కడ డాక్టర్ సాబ్‌ని అవమానించావ్ అని నిలదీస్తుంది హిమ. దీంతో అసలు నిజం చెప్పేస్తుంది జ్వాల. హిమ ఫోన్ చేసిందని జ్వాల చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది హిమ. హిమా? అంటే ఎవరో నీకు తెలుసా? నా సిస్టర్.. దాన్ని అలా పిలవడానికే నాకు అసహ్యంగా ఉంది.. అది నా సిస్టర్ ఏంటి.. మా అమ్మానాన్నలను పొట్టనబెట్టుకుంది. వాళ్ళ చావుకు కారణమైంది.ఇందుకే నాకు అక్కాచెల్లెళ్ల బందం నచ్చదు.తన మొహం చూడటం ఇష్టంలేక ఇంట్లోంచి పారిపోయి వచ్చాను.రోజులు గడుస్తున్నా దాని మీద కోపం తగ్గేలా లేదు అంటుంది.నా శత్రువు హిమ ఫోన్ చేసింది అని జ్వాల అన్న మాటలను హిమ తలుచుకుని బాధపడింది. నా పేరు చెప్పి శౌర్యను ఎవరు బెదిరించారు..ఆ అవసరం ఎవరికీ ఉంది.ఎవరన్నా తనని ఆట పట్టిస్తున్నారా? పాపం శౌర్య ఎంత ఫీలైందో ఏమో అంటూ ఆలోచనలో పడుతుంది హిమ.అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!