RRR: “RRR” ఈ ఏడాది మార్చి నెలలో విడుదలయ్యి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగింది. అంతకుముందు “బాహుబలి 2″… ఇండియాలో అన్ని ఇండస్ట్రీలలో రికార్డులు బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేయడం తెలిసిందే. ఇదే సినిమా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన “RRR” భారీ అంచనాల మధ్య రావటం సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన తర్వాత “RRR” చాలామంది విదేశీయులను ఆకట్టుకుంది.
కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్ రేంజ్ కి వెళుతుందని విదేశీయులు సైతం అప్పట్లో తెలియజేశారు. కానీ ఆస్కార్ కి ఎంపిక చేసే ఇండియన్ ఫిలిం కార్పొరేషన్ “RRR” నీ సెలెక్ట్ చేయలేదు. దీంతో “RRR” బృందం సొంతంగా ఆస్కార్ కి నామినేట్ అయ్యే మార్గాలను ఎంచుకొని అందరి అభిమానాలను ఆస్కార్ మెంబర్స్ కమిటీకి సినిమా ప్రదర్శించడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు రేసులో మరింత ముందుకు వెళ్లేలా.. ఆస్కార్ షార్ట్ లిస్టులో…”RRR” చోటు దక్కించుకుంది. విషయంలోకి వెళ్తే సినిమాలోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ కేటగిరిలో ఎంపికయింది.
ఈ క్రమంలో ఇండియా నుంచి ఆస్కార్ కి ఎంపికైన “చేలో షో” కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఇది కచ్చితంగా ఇండియన్ సినిమా ప్రేమికులకు గ్రేట్ న్యూస్. ఇప్పటికే “RRR” మూడు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం జరిగింది. దీంతో ఆస్కార్ కూడా రావాలని ఎంతోమంది అభిలాషించారు. ఈ క్రమంలో ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో “RRR” చోటు దక్కించుకోవడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జపాన్ దేశంలో “RRR” సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. దాదాపు 25 సంవత్సరాల నుండి జపాన్ దేశంలో రజనీకాంత్ సృష్టించిన “ముత్తు” రికార్డును..”RRR” రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!