Gunasekhar: హిట్లు – ఫ్లాపులకు సంబంధం లేకుండా గుణశేఖర్ అంటే తెలుగులో తెగువున్న తెలివైన డెరెక్టర్.. రిస్కీ డైరెక్టర్.. కాంప్రమైజ్ కానీ దర్శకుల పేర్లలో ఈయన పేరు ముందువరుసలోనే ఉంటుంది.. మూడు దశాబ్దాలకు ముందు నుండి సినిమాలు చేస్తూనే ఉన్నప్పటికీ మూడు, నాలుగు హిట్లు తప్ప పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కానీ ఆయన సాధించిన హిట్లు కూడా ఆయనపై ప్రత్యేక ముద్ర వేసుకునేలా చేశాయి. చిరంజీవితో చూడాలని ఉంది.. మహేష్ బాబుతో ఒక్కడు.. లాంటి సినిమాలతో తెలుగు సినీ కథ, కథనాల స్థాయిని ఓ రేంజికి తీసుకెళ్లారు. ఆ హీరోలను కూడా కొత్తగా చూపించారు. అటువంటి గుణశేఖర్ పదిహేడేళ్ల కాలంగా ఫామ్, ఫేమ్ రెండూ కోల్పోయారు. వరుసగా ఫ్లాపులతో సతమతమవుతున్నారు. మహేష్ బాబు ఒక్కడు తర్వాత గుణశేఖర్ క్రియేటివ్ నెస్ చూపించే సినిమా లేదు. వరుడుతో చేతులు కాల్చుకుని.., రుద్రమదేవితో పోగొట్టుకున్నారు. ఇన్నాళ్ల వ్యవధి తర్వాత ప్రస్తుతం “శాకుంతలం” అనే సినిమా తీస్తున్నారు. కానీ ఈ గుణశేఖర్ గురించి మనం ఇంతగా చెప్పుకోడానికి ఓ కారణం ఉంది. చిరంజీవితో తన తర్వాత సినిమా ఉంటుందని ఆయన మనసులోని మాటని బయటపెట్టారు. అందుకు కథ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు..
Gunasekhar: సామజిక కోణంలో మాంచి కథ..!
చిరంజీవి వయసు 62.. ఆయన వయసుకి తగినట్టు మంచి సామజిక అంశంతో కథను సిద్ధం చేస్తున్నట్టు గుణశేఖర్ వెల్లడించారు. త్వరలోనే చిరంజీవిని కలిసి, వినిపించి మొత్తం రెడీ చేస్తానని చెప్పుకొచ్చారు. శాకుంతలం తర్వాత ఎన్నేళ్లయినా చిరంజీవితో సినిమానే చేస్తానన్నారు. గతంలో ఈయన చిరంజీవితో చూడాలని ఉంది.., మృగరాజు సినిమాలకు డైరెక్టర్ చేశారు. చూడాలని ఉంది మంచి హిట్ సాధించగా.., మృగరాజు పెద్ద డిజాస్టర్ మిగిలింది..!