Nithiin: హీరో నితిన్ అందరికీ సుపరిచితుడే. “జయం” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. డాన్స్ పరంగా ఇంకా ఫైట్స్ పరంగా అన్ని రకాలుగా చాలా వైవిధ్యంగా స్క్రీన్ మీద పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు. కాగా ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు కావడంతో సోషల్ మీడియాలో నితిన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ ఈ విధంగా ఉంది…” 20 సంవత్సరాల క్రితం, నేను నా మొదటి చిత్రం “జయం” తో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈ రోజు నేను ఎలా భావిస్తున్నానో పదాలు వర్ణించలేను. కానీ నేను ప్రయత్నిస్తాను.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ముందుగా, నాలోని నటుడిని గుర్తించి, నాకు మొదటి బ్రేక్ ఇచ్చినందుకు దర్శకుడు తేజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అల్లాగే నేను పనిచేసిన ప్రతి సినిమా దర్శకులకి, నిర్మాతలకి , నటీనటులుకి , సాంకేతిక నిపుణులకి , సిబ్బందికి,,,అందరికీ ధన్యవాదాలు. మీరు లేకుంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవని కాదు. ఈ అందమైన ప్రయాణానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞుడను మరియు నాతో ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, మరిముఖ్యంగా కెరీర్లో ఎత్తుపల్లాలలో.. నా వెన్నంటే ఉంటూ నన్ను ఎంతగానో నమ్మిన నా అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ హీరో నితిన్ ఎమోషనల్ లెటర్ రాయడం జరిగింది.
హీరోగా నితిన్ నటించిన జయం సినిమా రిలీజ్ అయ్యి జూన్ 14 వ తారీకుకి 20 సంవత్సరాలు కావటంతో.. నితిన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం నితిన్ “మాచర్ల నియోజకవర్గం” అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో.. యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగా.. “మాచర్ల నియోజకవర్గం” తెరకెక్కించినట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!