90వ దశకంలో హీరోయిన్ గా ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ రాశి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అదుకుని.. చిత్ర పరిశ్రమలో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. అతి తక్కువ సమయంలోనే 50 సినిమాల్లో నటించింది. అయితే ఎంత త్వరగా కెరీర్ లో ఎదిగిందో.. అంతే త్వరగా స్క్రీన్ నుంచి కనుమరుగైపోయింది. ఒకానొక సమయంలో ఐటెం సాంగ్స్ తో పాటు వాంప్ పాత్రల్లో కూడా రాశి కనిపించింది.
ప్రస్తుతం ఈ అందాల రాశి కష్టాల్లో ఉంది.. సాయం అడిగితే.. చేసేవారు కరువయ్యారు.. ఎంతైనా సినిమా హీరోయిన్ కదా.. కోట్ల రూపాయల సంపాదన ఉందనుకుంటున్నారు.. కానీ వాస్తవ పరిస్థితులు మాతరం భిన్నంగా ఉంటాయి. హీరోయిన్ కావడం ఎంత కష్టమో.. ఆ ఇమేజ్ ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం.. ఇంకో విషయం ఏంటంటే.. సినిమాలు లేకపోయినా.. హీరోయిన్లు గ్లామరస్ గా కనిపించాలి.. లేకపోతే ఇండస్ట్రీ వారిని గుర్తించదు.. ఆ గ్లామర్ మెయింటైన్ చేయడం కోసం ఖర్చు బాగానే చేయాలి.. అందంగా కనిపించకపోతే వారికి ఆఫర్లు ఉండవని హీరోయిన్లు భయపడుతుంటారు.
ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ రాశి పరిస్థితి అధ్వానంగా మారింది. సినిమాల్లో అవకాశాలు లేవు.. చివరికి సీరియల్స్ లో నటిస్తూ రోజుకు రూ.5 వేలు సంపాదిస్తోంది.. అటు చూస్తే భారీగా అప్పుల పాలైంది.. రాశి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. రాశి అప్పట్లో కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. అప్పుడు తన ఆస్తులను పొగొట్టుకుంది. రాశి ఇప్పుడు కష్టాల్లో వలయంలో నలిగిపోతుంది. రాశికి సుమారు 15 కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయట.. ఈ అప్పులకు కారణం ఆమె భర్త అని తెలుస్తోంది. భర్తను డైరెక్టర్ చేయడం కోసం రాశి నిర్మాతగా మారింది. కష్టాల్లో ఉండటంతో రాశి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎక్కువ సీరియల్స్ లో నటించాలని నిర్ణయించుకుంది. సినీ పరిశ్రమలో తనకు పరిచయం ఉన్న వారిని కలిసి.. సిమాల్లో అవకాశాలు ఇవ్వాలని కోరుతుందట..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!